హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. ఆస్పత్రి ఆవరణలో ఉన్న జయశంకర్ విగ్రహానికి వైద్యులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. గాంధీ ఆసుపత్రి మెయిన్ బిల్డింగ్ వద్ద సూపరింటెండెంట్ రాజారావుతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
గాంధీ ఆస్పత్రిలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు - telangana state formation day celebrations
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీ ఆసుపత్రిలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అమరవీరులకు నివాళి అర్పించారు.
గాంధీ ఆస్పత్రిలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
మలిదశ ఉద్యమంలో అమరులైన తెలంగాణ పోరాట యోధులను స్మరించుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో వైద్యులు కూడా కీలక పాత్ర పోషించారని... రాజారావు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా నుంచి తెలంగాణా త్వరగా విముక్తి పొందాలని డాక్టర్లు ఆకాంక్షించారు.