తెలంగాణ

telangana

రాబందులు ఏమయ్యాయి? మహారాష్ట్రను సాయమెందుకు అడగాల్సి వచ్చింది?

By

Published : Jul 30, 2021, 11:06 AM IST

Updated : Jul 30, 2021, 11:57 AM IST

రాష్ట్రంలో రాబందుల(Vulture) సంఖ్య అంతకంతకూ తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో వాటి సంతతి పెంచడానికి రాష్ట్ర అటవీ శాఖ(State Forest Department) దృష్టి పెట్టింది. అందుకే మహారాష్ట్రను అర్థించింది.

Vultures in telangana, telangana State Forest Department
రాబందుల కోసం మహారాష్ట్రను అర్థించిన తెలంగాణ, తెలంగాణలో రాబందులు

రాబందులు ఏమయ్యాయి? మహారాష్ట్రను సాయమెందుకు అడగాల్సి వచ్చింది?

రాష్ట్రంలో రాబందులు(Vulture) కనుమరుగై పోవడంతో మహారాష్ట్ర నుంచి పదింటిని రప్పించడానికి రాష్ట్ర అటవీశాఖ( State Forest Department ) ప్రయత్నిస్తోంది. ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు ఇటీవల సమావేశమై చర్చించగా ఐదు జతల రాబందుల్ని ఇచ్చేందుకు మహారాష్ట్ర ఆమోదించింది. సెంట్రల్‌ జూ అథారిటీ నుంచి అనుమతి రాగానే వాటిని తీసుకువచ్చి సంరక్షించి సంతతి పెంచాలని అటవీశాఖ భావిస్తోంది.

కుమురంభీం ఆసిఫాబాద్‌ అడవుల్లో రాబందుల ఏకైక స్థావరమైన పాలరావుగుట్టలో ఏడాది నుంచి వాటి జాడే లేదు. హైదరాబాద్‌లోని జూ పార్కులో 14 రాబందులు ఉన్నా అవన్నీ వృద్ధాప్యాని(30-35ఏళ్లు)కి చేరాయి. సంతానోత్పత్తి వయసు (20-25 ఏళ్లు) దాటిపోవడంతో వాటి సంతతి పెరగడంలేదు.

ఈ నేపథ్యంలో మహారాష్ట్ర నుంచి తీసుకువచ్చే రాబందులతో సంతానోత్పత్తి పెంచాలన్నది లక్ష్యం. జూపార్కులో రాబందుల సంఖ్య 50కి చేరాక.. కొన్నింటిని తీసుకెళ్లి ఆసిఫాబాద్‌ అటవీ ప్రాంతాల్లో వదిలిపెడతామని అటవీశాఖ అధికారి ఒకరు ‘ఈటీవీ భారత్‌’కు తెలిపారు.

ఇదీ చదవండి:బాలికపై 6 నెలల పాటు సామూహిక అత్యాచారం

Last Updated : Jul 30, 2021, 11:57 AM IST

ABOUT THE AUTHOR

...view details