తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎన్నికలు ఏవైనా... విజయం తెరాసదే' - తెలంగాణ పురపాలక ఎన్నికల ఫలితాలు

తెలంగాణ మున్సిపల్​ ఎన్నికల్లో ప్రత్యర్థులు అందుకోలేని స్థాయిలో తెరాస తిరుగులేని ఫలితాలు సాధించిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు అన్నారు. ఈ విజయానికి కృషి చేసిన మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఇతర ప్రజాప్రతినిధులకు, మరీ ముఖ్యంగా కార్యకర్తలకు అభినందనలు తెలిపారు.

telangana state finance minister harish rao tweet on municipal election results
'ఎన్నికలు ఏవైనా... విజయం తెరాసదే'

By

Published : Jan 25, 2020, 4:24 PM IST

ఎన్నికలు ఏవైనా గెలుపు తెరాసదేనని మరోసారి తెలంగాణ ప్రజలు రుజువు చేశారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు అన్నారు. పుర ఎన్నికల్లోనూ తెరాస ప్రభంజనం సృష్టించిందని హర్షం వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణ సాధన కేసీఆర్ సారథ్యంలోని ఒక్క తెరాసకే సాధ్యమని చాటిన ప్రజానికానికి కృతజ్ఞతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details