తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో త్వరలో అందరికీ కొత్త ఓటరు గుర్తింపు కార్డులు - తెలంగాణ ఓటర్ల జాబితా విడుదల

రాష్ట్ర ఎన్నికల సంఘం.. తెలంగాణలో ఓటర్ల తుది జాబితా విడుదల చేసింది. జాబితాలో ఉన్న అందరికి త్వరలో నూతన గుర్తింపు కార్డులు ఇవ్వనున్నారు.

telangana state election commission released voter list
రాష్ట్ర మొత్తం ఓటర్ల సంఖ్య ఎంతంటే..

By

Published : Feb 7, 2020, 9:33 PM IST

ఓటర్ల తుది జాబితా విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి రాష్ట్ర ఎన్నికల అధికారులు... వీటిని ప్రకటించారు. మొత్తం 119 శాసనసభ నియోజకవర్గాల్లో 2 కోట్ల 99 లక్షల 32వేల 943 మంది ఓటర్లున్నారు. వీరిలో కోటీ యాభై లక్షల 41వేల 943 మంది పురుషులు. మహిళల సంఖ్య కోటీ 48 లక్షల 89వేల 410. ఇతరులు 1590 మంది ఉన్నారు. కొత్తగా లక్ష 44వేల 855 మంది ఓటర్లు నమోదు చేసుకున్నారు. త్రివిధ దళాల్లో సర్వీసు ఓటర్ల సంఖ్య 12వేల 639.

ఓటరు గుర్తింపు కార్డులకు సంబంధించి గతంలో విభిన్న రూపాల్లో కార్డుల సంఖ్యలున్నాయి. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వాటన్నింటినీ పది అంకెల నిర్ణీత నమూనాలోకి మార్చారు. ఓటర్లందరికీ త్వరలోనే కొత్త గుర్తింపు కార్డులు ఇవ్వనున్నారు. మొత్తం 50 లక్షల 79వేల 991 మంది గుర్తింపు కార్డుల సంఖ్యలను మార్చారు.

ఇవీచూడండి:దిల్లీ దంగల్: ఓటింగ్​కు సర్వం సిద్ధం.. రేపే పోలింగ్​

ABOUT THE AUTHOR

...view details