జీహెచ్ఎంసీ ఓటరు జాబితాలో పేరు ఉండి.. ప్రస్తుతం ఇక్కడ నివాసం లేనివారు, చిరునామా మార్చిన వారి వివరాలు అందించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. నకిలీ ఓటర్లు, చనిపోయిన వారి జాబితాలు పోలింగ్ కేంద్రాల వారీగా అందించాలంది.
పేరుండి ఇక్కడ లేని వారి వివరాలు ఇవ్వాలి: రాష్ట్ర ఎన్నికల సంఘం - జీహెచ్ఎంసీ ఎన్నికల తాజా వార్తలు
గ్రేటర్ హైదరాబాద్ ఓటరు జాబితాలో పేరుండి ప్రస్తుతం నివాసం లేనివారు, చిరునామా మార్చిన వారి వివరాలు అందించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. నకిలీ ఓటర్లు, చనిపోయిన వారి జాబితాలు పోలింగ్ కేంద్రాల వారీగా అందించాలని కోరింది.
పేరుండి ఇక్కడ లేని వారి వివరాలు ఇవ్వాలి: రాష్ట్ర ఎన్నికల సంఘం
ఇలాంటి ఓటర్లు ఓటు వేసేందుకు వచ్చినప్పుడు ధ్రువీకరణ పత్రాలు తనిఖీ చేసి... ఫొటో, అవసరమైతే బయోమెట్రిక్ తీసుకుని ఓటింగ్‌కు అనుమతించాలని చెప్పింది. పోలింగ్ అధికారులు పూర్తి స్థాయి పత్రాల తనిఖీ, పరిశీలన తర్వాతే ఓటు వేసేందుకు వీరిని అనుమతించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇదీ చదవండి: గ్రేటర్ ఎన్నికల్లో తెరాస అభ్యర్థుల రెండో జాబితా విడుదల