జీహెచ్ఎంసీ ఎన్నికలపై రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం విడివిడిగా సమావేశమైంది. ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ఖరారు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి, అభ్యర్థుల వ్యయం తదితర అంశాలపై సమాలోచనలు జరుపుతోంది. ఓటరు జాబితాకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన సమయం సరిపోదని భాజపా నేత ఎన్వీఎస్ ప్రభాకర్ తెలిపారు.
'ఆగమేఘాల మీద ఎన్నికలు నిర్వహించి ఇబ్బంది పెట్టొద్దు' - భాజపా నేత ఎన్వీఎస్ ప్రభాకర్ వార్తలు
ఓటరు జాబితాకు ఎస్‌ఈసీ ఇచ్చిన సమయం సరిపోదని భాజపా నేత ఎన్వీఎస్ ప్రభాకర్ తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికలపై రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశమైంది. ఆగమేఘాల మీద ఎన్నికలు నిర్వహించవద్దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ డిమాండ్ చేశారు.
ఆఘమేఘాల మీద ఎన్నికలు నిర్వహించి ఇబ్బంది పెట్టొద్దు: చాడ
నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యాక మద్యం దుకాణాలు పూర్తిగా మూసివేయాలని ప్రభాకర్ డిమాండ్ చేశారు. డివిజన్ల పునర్విభజన చేసి ఓటర్ల జాబితా సవరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఎస్ఈసీకి సూచించినట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో అనేక లోపాలు ఉన్నాయని... ఆగమేఘాల మీద నిర్వహించొద్దని చాడ డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎస్‌ఈసీ సమావేశం