రాష్ట్రంలో ఒక ఎంపీటీసీ, 33 సర్పంచ్ స్థానాలతోపాటు పలు వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆయా స్థానాల్లో ఓటర్ల జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను ప్రకటించింది. వచ్చే నెల 16న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రకటన, 18న జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం జరగనుంది. 19న మండల స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం, వచ్చే నెల 17 నుంచి 21వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణకు గడువు ఉంటుంది. 25లోగా అభ్యంతరాలు పరిష్కరించి 30న ఓటర్ల తుదిజాబితా ప్రకటన జారీ చేస్తారు. ఈ మేరకు అన్ని జిల్లాల పంచాయతీ అధికారులు, ఎంపీడీఓలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
సెప్టెంబర్లోనే స్థానికసంస్థల ఎన్నికలు.. షెడ్యూల్ విడుదల - ఎంపీటీసీ
స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. వివిధ కారణాలతో ఖాళీ అయిన, ఎన్నికలు జరగని సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
వచ్చే నెలలో సర్పంచ్ ఎన్నికలు..