తెలంగాణ

telangana

ETV Bharat / state

Debt of Telangana: రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు ఎంతంటే? - తెలంగాణ వార్తలు

Debt of Telangana 2021: ఈ ఏడాది నవంబర్‌ నాటికి రాష్ట్రం రూ.2,37,747 కోట్ల అప్పు చేసిందని కేంద్ర ఆర్థిక శాఖ లోక్​సభకు తెలిపింది. దేశీయ అప్పుగా రూ.2,34,912 కోట్లు అప్పు చేయగా.. రూ.2,835 కోట్లు విదేశీ అప్పు చేసిందని వెల్లడించింది.

Debt of Telangana, Debt of Telangana 2021
తెలంగాణ అప్పు

By

Published : Dec 21, 2021, 6:45 AM IST

Debt of Telangana 2021: రాష్ట్ర ప్రభుత్వ అప్పు రూ.2 లక్షల కోట్లు దాటిందని కేంద్ర ఆర్ధిక శాఖ వెల్లడించింది. ఈ ఏడాది నవంబర్‌ నాటికి 2,37,747 కోట్ల రూపాయలు అప్పు చేసిందని లోక్‌సభకు తెలిపింది. దీనిలో దేశీయ అప్పు రూ.2,34,912 కోట్ల రూపాయలు కాగా.. విదేశీ అప్పు 2,835 కోట్ల రూపాయలు ఉన్నట్లు స్పష్టం చేసింది.

లోక్‌సభలో కాంగ్రెస్‌ సభ్యుడు రేవంత్‌ రెడ్డి... ఆర్‌బీఐ, విదేశీ ఆర్థిక సంస్థలు, రీఫైనాన్సింగ్‌ సంస్థలు గత ఐదేళ్లలో తెలంగాణకు ఇచ్చిన అప్పులపై అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్ధిక శాఖ సహయ మంత్రి పంకజ్‌ చౌదరి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. రిజర్వ్‌ బ్యాంకు తెలంగాణకు ఎలాంటి అప్పు ఇవ్వలేదని, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, ఖర్చుల మధ్య తలెత్తే అంతరాన్ని పూడ్చేందుకు స్పెషల్‌ డ్రాయింగ్‌ ఫెసిలిటి, వేస్‌ అండ్‌ మీన్స్‌, ఓవర్‌ డ్రాప్ట్‌ సౌకర్యాన్ని కల్పించినట్లు వెల్లడించారు. గత ఐదేళ్లలో తెలంగాణకు... విదేశీ ఆర్ధిక సంస్థలు కానీ, రీఫైనాన్సింగ్‌ సంస్థలు గానీ రుణాలు ఇవ్వలేదని కేంద్ర ఆర్ధిక శాఖ స్పష్టం చేసింది. 2016-17 ఆర్ధిక సంవత్సరం నుంచి 2021-22 మధ్య కాలంలో విదేశీ ఆర్ధిక సాయంతో చేపట్టిన ప్రాజక్టులకు అదనపు కేంద్ర సాయం కింద 2,610.06 కోట్ల రూపాయల రుణాన్ని, 30.72 కోట్ల గ్రాంట్‌ అందించినట్లు కేంద్ర ఆర్ధిక శాఖ సమాధానంలో పేర్కొంది.

ఇదీ చూడండి:Debt of india: దేశం అప్పు రూ.135 లక్షల కోట్లు

ABOUT THE AUTHOR

...view details