రైతులు ఇతర ప్రైవేటు వ్యక్తులు, సంస్థల వద్ద అప్పులు తీసుకోవటం వల్ల నష్టపోతున్నారని రాష్ట్ర రుణ విముక్తి కమిషన్ ఛైర్మన్ వెంకటేశ్వర్లు అన్నారు. రైతులు తీసుకున్న లక్ష రూపాయలకు రూ.36 వేల రూపాయల వడ్డీ చెల్లిస్తున్నారని తెలిపారు. అలా కాకుండా బ్యాంకుల నుంచి రుణాలందిస్తే.. వడ్డీ రూ.11వేలు మాత్రమే అవుతుందని తెలిపారు. దీని వల్ల రైతులపై ఏడాదికి లక్ష రూపాయల భారం తగ్గుతుందని వెంకటేశ్వర్లు అన్నారు.
రైతులను అప్పుల నుంచి విముక్తి చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖ - నిర్మలా సీతారామన్
ప్రైవేటు అప్పుల నుంచి రైతులను విముక్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర రుణ విముక్తి కమిషన్ చైర్మన్ వెంకటేశ్వర్లు… కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌కు లేఖ రాశారు. వ్యవసాయ క్షేత్రాలను చిన్న తరహా పరిశ్రమల స్థాయిలో పరిగణించి రూ. 4 లక్షల దీర్ఘ కాల రుణాలను మంజూరు చేయాలని కోరారు.

రైతులను అప్పుల నుంచి విముక్తి చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖ
ప్రైవేటు వ్యక్తులు, సంస్థల నుంచి అప్పులు తీసుకొని సమస్యలు ఎదుర్కుంటున్న ఆర్బీఐ రైతులకు రుణాలు అందించాలని 2004లో రిజర్వుబ్యాంకు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ.. బ్యాంకులు ఆ దిశగా చర్యలు తీసుకోవట్లేదని ఆయన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. దేశంలో 40 శాతం రైతులు పంటరుణాలను ఉపయోగించుకోవట్లేదని, దీన్ని దృష్టిలో ఉంచుకొని బ్యాంకులు వాటి పరిధిలో రుణాలిచ్చే విధంగా లక్ష్యాలను నిర్ధేశించాలని విన్నవించారు.
ఇవీ చూడండి:రాష్ట్రంలో ఐదు వేలకు చేరువలో కరోనా కేసులు