యాభై వేల ఉద్యోగాల భర్తీ అనేది కంటి తుడుపు చర్యేనని భాజపా(bjp) రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ అన్నారు. అన్ని శాఖల్లోని ఖాళీలను(job vacancies) భర్తీ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పెద్దలు దిల్లీ వెళ్లిన ప్రతిసారి ఎఫ్‌ఆర్బీఎం పెంచాలని అడుగుతారని తెలిపారు. అప్పుల రాష్ట్రంగా తెలంగాణను మార్చేశారని ప్రభాకర్ ఆరోపించారు.
అందుకే తెలంగాణకు..
ఏడేళ్లల్లో ఏడు చుక్కల నీళ్లనైనా సీఎం కేసీఆర్(cm kcr) పెంచారా? అంటూ ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి(ysr) అక్రమంగా సంపాదించిన భూములు ఎక్కడున్నాయో తెలుసుకోవాలనే షర్మిల(ys sharmila) తెలంగాణకు వచ్చారని ఆయన దుయ్యబట్టారు. భారతి భయంతోనే షర్మిల పార్టీ పెట్టారన్నారు. బయ్యారం భూములు ఎక్కడ ఉన్నాయో తెలుసుకునేందుకు తల్లీకూతుళ్లు లోటస్‌పాండ్‌లో అడుగుపెట్టారని ఆరోపించారు.