తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణలోనూ కలిసి పనిచేసేందుకు జనసేన సుముఖం: బండి సంజయ్​ - తెలంగాణ తాజా వార్తలు

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వ్యవహార శైలిని జనసేన పార్టీ అధినేత పవన్​ కల్యాణ్​ దృష్టికి తీసుకెళ్లినట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్​లోని పవన్ కల్యాణ్ వ్యక్తిగత కార్యాలయంలో ఇద్దరు నేతలు భేటీ అయ్యారు. గంటపాటు రెండు రాష్ట్రాల రాజకీయ పరిస్థితులపై చర్చించారు.

bandi sanjay meet with janasena chief pawan kalyan
'తెలంగాణలోనూ కలిసి పనిచేసేందుకు జనసేన సుముఖం': బండి సంజయ్​

By

Published : May 25, 2020, 10:43 PM IST

ఏపీలో భాజపాతో కలిసి పనిచేస్తున్న జనసేన తెలంగాణలోనూ కలిసి పని చేసేందుకు పవన్ కల్యాణ్ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ తెలిపారు. జూబ్లీహిల్స్​లోని పవన్​ వ్యక్తిగత కార్యాలయంలో ఇద్దరు నేతలు... ఇరు రాష్ట్రాల రాజకీయ పరిస్థితులపై చర్చించారు.

తితిదే ఆస్తులను కాపాడేందుకు కమిటీలు వేయాలి.. తప్పితే అమ్ముకోవడానికి కాదని బండిసంజయ్​ విమర్శించారు. స్వామి వారి ఆస్తులను కాపాడేందుకు పార్టీలకు అతీతంగా అందరూ కలిసి రావాలని కోరారు. కేసీఆర్ ముస్లిం రాజ్యం కోసం.. జగన్ క్రైస్తవ రాజ్యం తేవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. తితిదే ఆస్తులను అమ్మాలనుకుంటే... చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఇద్దరు ముఖ్యమంత్రుల కుట్రలను ప్రజలకు వివరించేందుకు ముందుకు రావాలని పవన్ కోరినట్లు బండి సంజయ్ తెలిపారు.

'తెలంగాణలోనూ కలిసి పనిచేసేందుకు జనసేన సుముఖం': బండి సంజయ్​

ఇదీ చూడండి:మరో 3 రోజులు తప్పని భానుడి భగభగలు

ABOUT THE AUTHOR

...view details