బ్రిటిష్ వారి కబంద హస్తాల నుంచి దేశాన్ని విడిపించి, దేశ ప్రజల స్వేచ్ఛ కోసం పోరాటం చేసిన యోధుడు గాంధీ అని శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి కొనియాడారు. తన అహింసా మార్గంతో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వ్యక్తి గాంధీజీ అని అన్నారు. మహాత్ముని కలలను సీఎం కేసీఆర్ సాకారం చేసి చూపిస్తున్నారని పేర్కొన్నారు. దేశ ప్రజలకు ఆయన జయంతి ఓ పండుగ అని... అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. శాసనసభ ఆవరణలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్, మండలి చీఫ్ బోడకంటి వెంకటేశ్వర్లు, శాసనసభ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.