Telangana Sheep Scam ACB Inquiry 2024 : పశుసంవర్దక శాఖలో గొర్రెల పంపిణీ గోల్‌మాల్ కేసును పోలీసులు ఉన్నతాధికారులు అవినీతి నిరోధక శాఖకు బదిలీ చేశారు. గొర్రెల పంపిణీ పథకం(Sheep Distribution) పేరిట అధికారులు రైతులను మోసం చేశారని బాధితులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న గొర్రెల పంపిణీ పథకం కోసం రాష్ట్ర పశుసంవర్ధక శాఖ వేర్వేరు రాష్ట్రాల నుంచి గొర్రెపిల్లలు సేకరించి ఉచితంగా పంపిణీ చేస్తోంది.
కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల కార్యాలయాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బృందాల సోదాలు
"లోలో నా ది లైవ్ స్టాక్ కంపెనీ" నిర్వహిస్తున్న సయ్యద్ మోయీద్ అనే కాంట్రాక్టర్‌తో కలిసి మేడ్చల్ జిల్లా పశుసంవర్ధక శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేస్తున్న రవికుమార్, కేశవ్ గత ఏడాది ఆగస్టులో ఏపీలోని పల్నాడు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో రైతుల వద్ద గొర్రె పిల్లలు పరిశీలించారు. 20 గొర్రెలు,1 పొట్టేలు కలిపి ఒక యూనిట్‌గా మొత్తం 18 మంది రైతుల నుంచి 133 యూనిట్లు కొనుగోలు చేశారు.
Telangana Sheep Distribution Scam : అనంతరం రైతుల ఆధార్‌కార్డు, పాన్‌కార్డుతో పాటు బ్యాంక్ అకౌంట్ నంబర్లను పశుసంవర్ధకశాఖ అధికారులు సేకరించి ఆన్లైన్లో అప్లోడ్ చేసి నేరుగా రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేయాల్సి ఉండగా, అధికారులు చేయాల్సిన పని కాంట్రాక్టర్ సయ్యద్ మోయీదకు అప్పగించారు. దీంతో అతను రైతుల స్థానంలో తమ బినామీల బ్యాంక్ అకౌంట్ నంబర్లను ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. దీంతో పశుసంవర్ధకశాఖ నుంచి డబ్బులు నేరుగా బినామీ ఖాతాల్లో పడ్డాయి.