Telangana Secretariat Temples Inauguration :రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయం(Nalla Pochamma Temple at Secretariat)తో పాటు మసీదు, చర్చ్‌నుగవర్నర్ తమిళిసై సౌందరరాజన్,ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. సచివాలయానికి నైరుతిలో నిర్మించిన నల్ల పోచమ్మ అమ్మవారితో పాటు శివాలయం, అంజనేయ స్వామి ఆలయాలను నిర్మించారు. ప్రారంభ వేడుకల్లో భాగంగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన, విగ్రహాలకు ప్రతిష్ట జరిగింది.
Nalla pochamma Temple at TS Secretariat :ప్రారంభోత్సం సందర్భంగా.. సచివాలయంలోని నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయంలో గత రెండ్రోజుల నుంచి ఆలయ ప్రతిస్థాపనా క్రతువులు జరుగుతున్నాయి. ఇవాళ కూడా ఆలయాలకు శాస్త్రోక్తంగా ప్రతిస్థాపన వేడుకలు జరగాయి. మొదటి రోజు ముందుగా గణపతి పూజతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో రహదార్లు, భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు, సచివాలయ సంఘం అధ్యక్షుడు నరేందర్ రావు దంపతులు పాల్గొన్నారు.
Telangana Secretariat Nalla pochamma Temple :రెండో రోజు స్థాపిత పూజ, ప్రతిష్టాపన హోమం, తిరుమంజసం, మహాలక్ష్మియాగం, ఫల పుష్పాదివాసం, మహా మంగళహారతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పాల్గొన్నారు. ఇవాళ మూడో రోజున.. ఉదయం నుంచి చండీయాగం, దిగ్బలి, ప్రాణ ప్రతిష్ట హోమం, ధ్వజస్థంభ ప్రతిష్టాపన చేపట్టగా.. అనంతరం యంత్ర ప్రతిష్టాపన.. విగ్రహాల ప్రతిష్ట, శిఖర కుంభాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మహా పూర్ణాహుతి, మహా మంగళహారతి కార్యక్రమాల్లో గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్, కొప్పుల ఈశ్వర్, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీఎస్ శాంతికుమారి(CS Shanti Kumari) అమ్మవారి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.