కొత్త సచివాలయం నిర్మాణంలో భాగంగా బూర్గుల రామకృష్ణారావు భవన్ నుంచి కార్యాలయాల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. సచివాలయంలోని కీలక శాఖల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. నాలుగురోజులుగా బీఆర్కే భవన్ నుంచి కార్యాలయాలను వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. తొమ్మిదో అంతస్తులో ఉన్న విజిలెన్స్ కమిషన్ కార్యాలయాన్ని గతంలో ఏపీ డీజీపీ కార్యాలయం కోసం కేటాయించిన భవనంలోకి తరలిస్తున్నారు. భవన్లో ఇంకా ఉన్న ఇతర కార్యాలయాల తరలింపు కోసం సిద్ధం చేస్తున్నారు. ఆయా కార్యాలయాల తరలింపు కోసం అవసరమైన భవనాలు అందుబాటులో లేవు. సరిపడా భవనాల కోసం అన్వేషణ కొనసాగుతోంది.
సచివాలయ తరలింపు: భవనాల కోసం అన్వేషణ - brk bhawan
సచివాలయంలోని కీలక శాఖల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇందుకోసం బీఆర్కే భవన్‌ను ఖాళీ చేయిస్తున్నారు. ప్రత్యామ్నాయ భవనాలు దొరక్క తరలింపు ఆలస్యమవుతోంది.
brk bhawan