Telangana Secretariat Getting Ready For New Government: శాసనసభ ఎన్నికలతో రాష్ట్ర ప్రభుత్వం మారుతోంది. గురువారం కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరనుంది. ప్రభుత్వ మార్పుతో ముఖ్యమంత్రి, మంత్రులు, సలహాదార్ల కార్యాలయాలు ఛాంబర్లు, పేషీలను ఖాళీ చేస్తున్నారు. ఇప్పటికే సీఎం సహా మంత్రులు, వారి కార్యదర్శులకు సంబంధించిన బోర్డులు తొలగించారు. మంత్రుల పేషీల్లోని దస్త్రాలు, ఇతరత్రాలను ఆయా శాఖలు, విభాగాలకు అప్పగిస్తున్నారు.
సీఎంఓ కార్యదర్శుల వద్ద ఉన్న దస్త్రాలను సంబంధిత శాఖలకు అప్పగిస్తున్నారు. కంప్యూటర్లు, ఇతర సామాగ్రిని సాధారణ పరిపాలనాశాఖకు అప్పగిస్తున్నారు. అందులోని వ్యక్తిగత సామాన్లు, ఇతరత్రాలు తీసుకెళ్తున్నారు. మంత్రుల వ్యక్తిగత కార్యదర్శులు వ్యక్తిగత సహాయకులు దగ్గరుండి అన్నింటిని అప్పగిస్తున్నారు.
ఉత్కంఠ వీడింది, ఊహించిందే జరిగింది - రేవంత్ రెడ్డికే ముఖ్యమంత్రి పగ్గాలు
Secretariat Ready For New Government : సచివాలయం నుంచి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, దస్త్రాలు తీసుకెళ్లకుండా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. ఈ మేరకు సిబ్బంది, పోలీసులకు ఆదేశాలివ్వడంతో వ్యక్తిగత సామాన్లు, ఇతరత్రాలను తీసుకెళ్తున్న సమయంలో అన్నింటినీ పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఖాళీ అయిన ముఖ్యమంత్రి ఛాంబర్‌ను సీఎస్ శాంతికుమారి పరిశీలించారు. సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి శేషాద్రి, ఇతర అధికారులతో కలిసి సీఎం గది, సమావేశ మందిరం, పేషీలను పరిశీలించారు. మంత్రివర్గ సమావేశ మందిరాన్ని పరిశీలించారు. అక్కడున్న ఫర్నీచర్, వసతులపై ఆరాతీశారు. ఇవాళ్టిలోగా అన్నింటినీ పూర్తి స్థాయిలో సిద్ధంచేయాలని అధికారులను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు.
తెలంగాణ కొత్త సీఎం అనుముల రేవంత్ రెడ్డి - జడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రస్థానం సాగిందిలా