తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీకి ఎస్​ఈసీ లేఖ.. ఎందుకంటే? - GHMC latest news

గ్రేటర్​ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీకి... రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. బ్యాంకర్లు అనుసరించాల్సిన నియమ నిబంధనలను ఆ లేఖలో వివరించింది.

SEC letter to the State Level Bankers Committee
రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీకి ఎస్​ఈసీ లేఖ

By

Published : Nov 23, 2020, 5:04 PM IST

జీహెచ్ఎంసీ ఎన్నికల దృష్ట్యా నగదు రవాణా విషయంలో బ్యాంకర్లు అనుసరించాల్సిన నియమ నిబంధనలను వివరిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీకి లేఖ రాసింది. ఎస్‌ఎల్బీసీ కన్వీనర్‌కు రాసిన లేఖలో బ్యాంకులకు రవాణా చేసే వాహనాలుకాని, వ్యక్తులు కాని పూర్తి ఆధారాలు వెంట ఉంచుకోవడం తప్పనిసరని సూచించారు.

పాటించాల్సిందే

నగదు రవాణాకు చెంది ఐసీఐసీఐ ఖైరతాబాద్‌ మేనేజర్‌ రాసిన లేఖను కోడ్‌ చేస్తూ.. ఈ నియమ నిబంధనలు జారీ చేసినట్లు ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్‌కుమార్‌ స్పష్టం చేశారు. నగదు తీసుకెళ్లే వాహనాలను ఎన్నికల అధికారులు ఆపి తనిఖీలు నిర్వహించిన సమయంలో అందుకు తగిన ఆధారాలు చూపించాలని పేర్కొన్నారు. నగదు రవాణా ప్రక్రియ అంతా కూడా ప్రైవేటు ఏజన్సీలు చేస్తున్నందున... సంబంధిత సంస్థలు ఎన్నికల నియమ నిబంధనలకు లోబడి తమ విధులు నిర్వర్తించాలని ఆయన స్పష్టం చేశారు.

ఎందుకోసం తీసుకెళ్లారో వివరాలు తప్పనిసరి

నగదు నిల్వ కేంద్రం నుంచి బ్రాంచీలకు నగదు తీసుకెళ్లడం కాని, ఏటీఎంల్లో నగదు నింపేందుకు తీసుకెళ్లడంకాని చేసేటప్పుడు సంబంధిత సంస్థలు ఆర్బీఐ నిబంధనలను పాటించాలన్నారు. నగదు తీసుకెళ్లే ఔట్‌ సోర్సింగ్‌ వ్యాన్​లు తమ వెంట ఏ బ్యాంకుకు చెందిన నగదు, ఎక్కడ నుంచి ఎక్కడ తీసుకెళ్లుతున్నారు... ఎందుకోసం తీసుకెళ్లుతున్నారు తదితర వివరాలు ఉంచుకోవడం తప్పనిసరని వెల్లడించారు.

గుర్తింపు కార్డు ఉండాల్సిందే!

నగదు రవాణా చేసే వాహనదారులు ఆయా సంస్థలు జారీ చేసిన గుర్తింపు కార్డులు వెంట పెట్టుకోవాలని సూచించారు. వ్యాపారులు బ్యాంకుల్లో డిపాజట్‌ చేయడానికి తీసుకెళ్తున్న నగదు రవాణా చేస్తే సీజ్‌ చేయరాదని ఎన్నికల విధులు నిర్వహించే ప్లయ్యింగ్‌ స్వాడ్‌ బృందాలకు, స్టాటిక్‌ సర్వెలెన్స్‌ బృందాలకు ఆదేశాలిచ్చారు. వ్యాపార సంస్థకు చెంది నగదు డిపాజిట్‌ చేసేందుకు తీసుకెళ్తున్న సమయంలో ఆ వ్యాపార సంస్థ రిజిస్ట్రేషన్‌ ధ్రువీకరణ పత్రం, లేఖ పాన్‌ కార్డు, బ్యాంకు పాస్‌బుక్‌, తరచూ డబ్బు డిపాజిట్‌ చేస్తున్నట్లు బ్యాంకు స్టేట్‌మెంటు ఇందులో ఏదొకటి చూపాల్సి ఉంటుందని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

ఆ డబ్బులు సీజ్​ చేయరాదు

ఇందుకు సంబంధించిన నగదు సీజ్‌ చేయరాదని వెల్లడించింది. వైద్య అవసరాలకు నగదు తీసుకెళ్తుంటే.. వైద్యానికి సంబంధించిన ఆధారాలు చూపిస్తే ఆ నగదును సీజ్‌ చేయరాదు. వివాహాల అవసరాలకు కోసం... నగదు తరలిస్తున్నట్లు అయితే... ఆహ్వాన పత్రిక లేఖ ఇతర వ్యక్తిగత వివరాలు చూపాల్సి ఉంటుందని వివరించారు. కల్యాణ మండపానికి అడ్వాన్స్‌ ఇచ్చేందుకుకాని, బంగారు, వెండి లాంటివి కొనుగోలు చేయడం కోసంకాని తీసుకెళ్లే నగదు సీజ్‌ చేయరాదని ఎన్నికల సంఘం ఎన్నిక కార్యదర్శి వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details