కరోనా పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెంబర్ 45ను విడుదల చేస్తూ... ప్రైవేటు సంస్థలో పనిచేసే ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని తెలంగాణ పాఠశాలల సాంకేతిక విద్యా ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. అలాగే ఉద్యోగం నుంచి తొలగించవద్దని సంఘం అధ్యక్షుడు సంతోష్ కుమార్ ప్రభుత్వాని కోరారు.
ప్రైవేటు సంస్థల ఉద్యోగులకు జీతాలు చెల్లించాలంటూ ఆందోళన - ప్రైవేటు సంస్థల ఉద్యోగులకు జీతాలు చెల్లించాలంటూ ఆందోళన
హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లోని ఉన్నత విద్యాశాఖ కార్యాలయం ఎదుట తెలంగాణ పాఠశాలల సాంకేతిక విద్యా ఉద్యోగుల సంఘం ఆందోళన నిర్వహించింది. జీఓ నెంబర్ 45ను విడుదల చేస్తూ… ప్రైవేటు సంస్థలో పనిచేసే ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని కోరారు.
![ప్రైవేటు సంస్థల ఉద్యోగులకు జీతాలు చెల్లించాలంటూ ఆందోళన telanagana technical education employees protest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8365255-1001-8365255-1597055236679.jpg)
ప్రైవేటు సంస్థల ఉద్యోగులకు జీతాలు చెల్లించాలంటూ ఆందోళన
ఈ మేరకు మాసబ్ ట్యాంక్‌లోని ఉన్నత విద్యా శాఖ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితిలో కొన్ని కళాశాలలో వేతనాలు చెల్లించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే అధ్యాపకులకు ప్రతినెల వేతనాలు చెల్లించాలని కోరారు.
ఇవీ చూడండి:బైరామల్‌గూడ పైవంతెనను ప్రారంభించిన కేటీఆర్