గ్రామాల్లో ఎల్ఈడీ బల్బుల ఏర్పాటును ప్రైవేట్ సంస్థకు అప్పగించడాన్ని తెలంగాణ సర్పంచుల సంఘం తప్పుబట్టింది. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్ యాదవ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లో పంచాయతీరాజ్ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
ప్రభుత్వ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి : సర్పంచ్ల సంఘం - హైదరాబాద్‌లో సర్పంచుల సంఘం
గ్రామాల్లో ఎల్ఈడీ బల్బుల ఏర్పాటును ప్రైవేట్ సంస్థకు అప్పగించే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డిమాండ్ చేశారు. హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లో ఉన్న పంచాయతీరాజ్ కార్యాలయంలో కమిషనర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు.
![ప్రభుత్వ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి : సర్పంచ్ల సంఘం telangana sarpanch unoion demands to cancel contract of led bulbs to private company](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9415803-924-9415803-1604399519557.jpg)
ప్రభుత్వ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి : వెంకటేశ్ యాదవ్
సర్పంచుల వ్యవస్థను నిర్వీర్యం చేసేలా ప్రభుత్వ వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. గ్రామాల్లో పల్లెప్రగతి పనులకు నిధుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఉపసర్పంచ్‌కు ఉన్న చెక్ పవర్‌ను రద్దు చేయాలని కోరారు. గ్రామాలకు రావాల్సిన నిధులు వెంటనే విడుదల చేయాలని కమిషనర్‌ను కోరామని ఆయన తెలిపారు.