తెలంగాణలో సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్లపై హైదరాబాద్ బీఆర్కే భవన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. వివిధ శాఖల అధికారులతో ముచ్చటించారు. ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ ద్వారా నిర్మించే రోడ్లు, కల్వర్టుల నిర్మాణాలు జనవరి 25 నాటికి పూర్తి చేయాలని అధికారులకు సీఎస్ సూచించారు. ఇతర రోడ్లు, ప్యాచ్ వర్కులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. రోడ్ల వెంట మూడు భాషలతో సైన్ బోర్డుల ఏర్పాటును వెంటనే ప్రారంభించాలన్నారు. పార్కింగ్‌ల వద్ద వాలంటీర్లను ఏర్పాటు చేసి సక్రమంగా వాహనాలు పార్కింగ్ చేసేలా చూడలన్నారు. శానిటేషన్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
రద్దీ ఏర్పడకుండా ఏర్పాట్లు
జిల్లా యంత్రాంగం అక్కడి పనులను సమన్వయంతో పూర్తి చేయలన్నారు. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్‌ను సక్రమ పద్ధతిలో ఏర్పాటు చేసి ప్రజలకు ఏప్పటికప్పుడు సమాచారం అందించాలన్నారు. కలెక్టర్, ఎస్పీ, స్పెషల్ ఆఫీసర్, ఐటీడీఎ పీఓల సమన్వయంతో పనులు చేపట్టాలన్నారు. గద్దెలకు వెళ్లే దారులలో, షాపుల వద్ద రద్దీ ఏర్పడకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. బారికేడ్లు ఏర్పాటు చేసి క్రమబద్దికరించాలన్నారు. పనుల పరీశిలనను త్వరలోనే పర్యటించనున్నట్లు తెలిపారు.