తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Rythu Runa Mafi 2023 : సాంకేతిక చిక్కులతో రైతులకు చేరని రుణమాఫీ సొమ్ము.. మూతబడిన ఖాతాల్లో జమై నిధులు వెనక్కి - తెలంగాణ న్యూస్

Telangana Rythu Runa Mafi 2023 : రాష్ట్రప్రభుత్వం విడుదల చేసిన లక్షలోపు రుణమాఫీ డబ్బులు.. సాంకేతికపర చిక్కులతో నేరుగా రైతులకు చేరట్లేదు. కొందరికి మూతపడిన ఖాతాల్లో డబ్బులు జమై నిధులు తిరిగి వెళ్లిపోతుండగా.. ఇంకొందరికి డబ్బులొచ్చినట్లు సందేశాలొచ్చినా ఖాతాల్లో జమకావట్లేదు. కొందరికి ఒకటి కంటే.. ఎక్కువ ఖాతాల్లో బకాయిలున్నాయని, మరికొందరివి ఫ్రీజ్ అయ్యాయని.. ఇలా బ్యాంకర్లు అనేక కారణాలు చెబుతున్నారు. కొన్ని బ్యాంకులు మాఫీ డబ్బులు పాతబకాయిల కింద జమ చేసుకొని మిగిలిన డబ్బులే చేతికిస్తున్నారు. 2018 నాటికి లక్షలోపు పంటరుణం ఉన్నా కొందరికి మాఫీ అమలు కాలేదు. సరైన అవగాహన, సమాచారం లేక అన్నదాతలు గందరగోళానికి గురవుతున్నారు.

Rythu Runamafi 2023
Rythu Runamafi

By ETV Bharat Telangana Team

Published : Aug 25, 2023, 10:03 AM IST

Telangana Rythu Runamafi 2023 సాంకేతిక లోపాలతో రైతులకు చేరని రుణమాఫీ సొమ్ము మూతపడిన ఖాతాల్లో డబ్బులు జమై నిధులు వెనక్కి

Telangana Rythu Runa Mafi 2023 :ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR on Farmer Loan Waiver).. 2018 డిసెంబర్ నాటికి లక్షలోపు పంట రుణాలు తీసుకున్న రైతులందరికీ పూర్తిస్థాయిలో రుణమాఫీ అమలు చేయాలని.. ఇటీవలే ఆదేశాలు జారీ చేశారు. డబ్బులను సైతం ప్రభుత్వం.. బ్యాంకుల ద్వారా రైతుల ఖాతాలకు విడుదల చేసింది. కానీ ఆ రుణమాఫీ డబ్బులు రైతులకు చేరడంలోనే అనేక సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

Telangana Rythu Runa Mafi Issues :2018లో లక్షలోపు పంట రుణం తీసుకున్న రైతులు.. ఆ తర్వాత వాటిని రెన్యూవల్ చేసుకోకపోవడం, ఖాతాల్ని కొనసాగించకపోవడం వంటి కారణాలతో కొన్ని బ్యాంకుఖాతాలు మూతపడ్డాయి. ఎస్​బీహెచ్​(SBH) వంటి బ్యాంకులు.. ఎస్బీఐ(SBI)లో విలీనం కావడంతో ఖాతా నెంబర్లు మారాయి. విడుదలైనరుణమాఫీ నిధులు.. గతంలో ఇచ్చిన పాత ఖాతాల్లోనే జమవుతున్నాయి. అవి మూతపడిన కారణంగా నిధులు తిరిగి వెనక్కి వెళ్లిపోతున్నాయి. పాత ఖాతస్థానంలో కొత్తఖాత తెరచిన రైతులకు.. ఆ డబ్బులు అందడం లేదు. రుణమాఫీ నిధులువచ్చినట్లు మొబైల్ ఫోన్లకు సందేశాలు వచ్చినా.. బ్యాంకుకెళ్లి చూస్తే ఆ డబ్బులు కనిపించడం లేదు. కొందరికి పాతఖాతాల్లో రుణమాఫీ డబ్బులు జమైనట్లుగా చూపించినా.. మొబైల్ నంబర్లు మారడంతో సందేశాలు రావడం లేదు.

Rythu Runamafi Telangana 2023 : అన్నదాతలకు పంద్రాగస్టు కానుక.. రూ.99,999 లోపు రైతు రుణాలన్నీ మాఫీ

Crop Loan Waiver Telangana Farmers 2023 :కొంతమందికి లక్షలోపు రుణమాఫీజమైనట్లుగా సెల్‌ఫోన్లకి సందేశాలు వస్తున్నాయి. బ్యాంకులకు వెళ్తే వచ్చిన మాట వాస్తవమేనన్న బ్యాంకర్లు.. పాతబకాయిల కింద జమచేసుకొని మిగిలిన డబ్బులు ఇస్తామని చెబుతున్నారు. కొందరు నిర్వహణ చార్జీలు, వడ్డీలు, ఇతర బ్యాంకుల్లో బకాయిలు.. ఇలా అనేక కారణాలు చెప్పి రుణమాఫీ డబులను బకాయిల కింద జమ చేసుకుంటున్నాయి.

Rythu Runamafi 2023 :ఇంకా కొంతమంది రైతులకు 2018 డిసెంబర్ నాటికి లక్షలోపు పంటరుణమే ఉన్నా.. మాఫీ కాలేదని బ్యాంకర్లు చెప్పడంతో కర్షకులు ఖంగు తింటున్నారు. అర్హులైనా ఎందుకు రాలేదన్నది వారి ప్రశ్న. రుణమాఫీ డబ్బులు(Runa Mafi Money) రాకపోవడానికి బ్యాంకులు అనేక కారణాలు చెప్తున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన రైతులు వేర్వేరు ఖాతాల ద్వారా 2018 డిసెంబర్ నాటికి లక్షకంటే ఎక్కువ రుణాలు తీసుకోవడం, రుణమాఫీ డబ్బులు పడిన ఖాతాలు ఫ్రీజింగ్‌లో ఉండటం, పైబ్యాంకులు లావాదేవిలు నిలిపివేయడం వంటి సాంకేతిక కారణాలతో రుణమాఫీ డబ్బులు రైతులకు అందట్లేదు. సాంకేతిక చిక్కులు అర్థం కాక, సరైన అవగాహన లేక, బ్యాంకర్ల నుంచి సరైన సమాచారం లేక రైతులు గందరగోళానికి గురువుతున్నారు.

రుణమాఫీ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బ్యాంకర్లు చెబుతున్నారు. విడతల వారీగా ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని మహబూబ్​నగర్ జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ భాస్కర్ వెల్లడించారు. పంట రుణాలు తప్ప ఏ బకాయిల కింద రుణమాఫీ డబ్బులు జమ చేసుకోకూడదని స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు వెల్లడించారు.

Harish Rao on Rythu Runamafi :రుణమాఫీ సొమ్మును ఇతర బాకీల కింద జమ చేసుకోవద్దని.. ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ఇటీవలే బ్యాంకర్లకు స్పష్టంగా సూచించారు. ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో రుణాలుంటే మాఫీ సొమ్మును అన్ని ఖాతాల్లో సర్దుబాటు చేయాలని ఆదేశించారు. ఒకవేళ రైతు అప్పటికే పంటరుణం చెల్లించి ఉంటే రుణమాఫీ డబ్బు నేరుగా వారి చేతికి అందించాలని కోరారు. ప్రభుత్వం అందించిన డబ్బు ఏదో ఒక రూపంలో తమకు చేరిందనే అభిప్రాయం రైతుల్లో రావాలన్నది సర్కారు ఉద్దేశం.

Rythu Runamafi 2023 : రూ. లక్షలోపు రుణమాఫీ పూర్తి చేసిన ప్రభుత్వం

Rythu Runamafi Telangana 2023 : వచ్చే నెల రెండో వారంలోపు రుణమాఫీ చెల్లింపులు పూర్తి..!

ABOUT THE AUTHOR

...view details