హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్లో తెలంగాణ రైతు బంధు సమితి రాష్ట్ర కార్యాలయం అందుబాటులోకి వచ్చింది. తెలంగాణ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం... కార్యాలయంలోనికి ప్రవేశించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, రైతుబంధు సమితి రాష్ట్ర కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. పలు దస్త్రాలపై పల్లా.. సంతకాలు చేశారు.
నాంపల్లిలో తెలంగాణ రైతు బంధు సమితి రాష్ట్ర కార్యాలయం - mlc palla rajeshwar reddy
రైతులకు మరింత చేరువలో తెలంగాణ రైతు బంధు సమితి రాష్ట్ర కార్యాలయం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని పట్టు పరిశ్రమ శాఖ కార్యాలయంలో కొనసాగుతున్న ఈ కార్యాలయాన్ని నగర నడిబొడ్డుకు మార్చారు. నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో కొత్తగా రాష్ట్ర కార్యాలయం కొలువు తీరింది.
నాంపల్లిలో తెలంగాణ రైతు బంధు సమితి రాష్ట్ర కార్యాలయం
రైతుల సౌకర్యార్థం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ కార్యాలయాన్ని నాంపల్లికి తరలించినట్లు రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర రైతాంగం ప్రయోజనాలు, అవసరాలు, సమస్యల సత్వర పరిష్కారానికి మరింత చేరువగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ కీలక చర్యలు తీసుకున్నామని ప్రకటించారు. ఈ నిర్ణయం పట్ల తనకు చాలా సంతోషంగా ఉందని.. ఇక నుంచి తెలంగాణ రైతు బంధు సమితికి సంబంధించి అన్ని రకాల కార్యకలాపాలు నాంపల్లిలోని కొత్త కార్యాలయం నుంచే కొనసాగుతాయని పల్లా స్పష్టం చేశారు.