తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Run in Hyderabad Today : దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు 'తెలంగాణ రన్' - హైదరాబాద్ వార్తలు

Telangana Run Program in Telangana Today : దశాబ్ది ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. అందులో భాగంగా పోలీసులు, వివిధ శాఖల అధికారులతో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతి కుమారి సమావేశమయ్యారు. ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

11th Of Telangana Decade Celebrations
11th Of Telangana Decade Celebrations

By

Published : Jun 12, 2023, 8:04 AM IST

'రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా రన్ కార్యక్రమం నిర్వహించాలి'

Telangana Run Program Today:తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి సమావేశమయ్యారు. తెలంగాణ రన్ కార్యక్రమంతో పాటు.. తదుపరి రోజుల్లో నిర్వహించాల్సిన మహిళా దినోత్సవం, వైద్య ఆరోగ్య దినోత్సవాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ సూపరింటెండెంట్లతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కార్యక్రమంలో డీజీపీ అంజనీ కుమార్, వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Telangana Decade Celebrations 2023 :రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లో ఘనంగా తెలంగాణ రన్ నిర్వహించాలని, ఈ రన్​లో ప్రజాప్రతినిధులు, యువత, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు భాగస్వామ్యం అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్ నుంచి తెలంగాణ రన్ ప్రారంభమవుతుందని.. ముఖ్యఅతిథులుగా రాష్ట్ర మంత్రులతో పాటుగా క్రీడాకారులు, గాయకులు, దాదాపు 4 వేలకు పైగా రన్నర్లు పాల్గొననున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌ మార్గ్‌, నెక్లెస్‌రోడ్డు, ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

Telangana Decade Celebrations 2023 : దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని ముఖ్యమంత్రి కేసిఆర్ మరింత పెంచారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్‌లోని జలవిహార్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందని గుర్తుచేశారు.

11th Of Telangana Decade Celebrations :తొమ్మిది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంసాధించిన ప్రగతి, అభివృద్ధిని ఔన్నత్యాన్ని పెంపొందించే విధంగా సాహితీవేత్తలు, కవులు రచనలు వెలువరించాలనిమంత్రి జగదీశ్​ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఉదయాదిత్యా భవన్లో తెలంగాణ సాహిత్య దినోత్సవం అట్టహాసంగా నిర్వహించారు.

దివ్యాంగులకు మరో వెయ్యి పింఛన్ పెంపు :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఎమ్మెల్యే హరిప్రియ సమక్షంలో దివ్యాంగులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇప్పటికే ఉన్న మూడు వేల 16 రూపాయల పింఛనును మరో వెయ్యి రూపాయలు పెంచడం పట్ల ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీ కార్యాలయం ఆవరణలో దివ్యాంగులు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పుష్పాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. మరుగున పడుతున్న సాహిత్య కలను, భవిష్యత్ తరాల్లోకి తీసుకువెళ్లి సాహితీవేత్తల ప్రాముఖ్యతను అందరికీ తెలియజేసేలా చేయాలని భద్రాద్రి రామాలయ సమీపంలో జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ అన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details