తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్టీసీలో త్వరలో 1,020 కొత్త బస్సులు.. ప్రయాణికులకు సేవలు మరింత చేరువ - కొత్త బస్సులను కొనుగోలు చేయనున్న ఆర్టీసీ

TSRTC Buying New Buses: టీఎస్ ఆర్టీసీలో త్వరలో 1,020 కొత్త బస్సులు రాబోతున్నాయి. మరో రెండు మూడు నెలల్లో కొత్త బస్సులు రోడ్లపై పరుగులు పెడతాయని యాజమాన్యం ప్రకటించింది. కొత్తగా రాబోయే బస్సుల్లో సూపర్ లగ్జరీ బస్సులు, ఎలక్ట్రికల్ బస్సులు ఉండనున్నట్లు అధికారులు తెలిపారు.

TSRTC
TSRTC

By

Published : Nov 28, 2022, 3:00 PM IST

TSRTC Buying New Buses: తెలంగాణ ఆర్టీసీలో త్వరలో కొత్త బస్సులు రాబోతున్నాయి. 1,020 నయా బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేస్తోంది. మరో రెండు మూడు నెలల్లో ఈ కొత్త బస్సులు రోడ్లపై పరుగులు పెడతాయని యాజమాన్యం ప్రకటించింది. మొత్తం బస్సుల్లో 720 బస్సులు సూపర్ లగ్జరీ బస్సులను కొనుగోలు చేస్తున్నారు. ఈ బస్సులను సొంతంగా కొనుగోలు చేస్తున్న ఆర్టీసీ... వీటిని జిల్లాకు పంపించనుంది. జిల్లాల్లో ఇప్పటికే తిరిగి పాతబడిపోయిన సూపర్ లగ్జరీ బస్సులను గ్రేటర్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు.

పాత బస్సులకు మియపూర్ బస్ బాడీ బిల్డింగ్‌లో మార్పులు చేసి వాటిని సిటీ బస్సులుగా మార్చనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే గ్రేటర్‌లో సుమారు 720వరకు పాత సిటీ బస్సులు ఉన్నాయి. వాటిని తుక్కు కిందకు మార్చనున్నారు. మరో 300 ఎలక్ట్రిక్ బస్సులను అద్దె ప్రాతిపదికన ఆర్టీసీ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి వెయ్యికి పైగా వచ్చే కొత్త బస్సులతో టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు మరింత చేరువ కావాలని చూస్తోంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details