TSRTC: తెలంగాణ ఆర్టీసీలో మరో 70 అద్దె బస్సులు పెరగనున్నాయి. ఆగస్టు నాటికి 3,107 అద్దెబస్సులు, 6,601 సొంత బస్సులు ఉన్నాయి. తాజాగా హైదరాబాద్లో 40, కరీంనగర్ జోన్ పరిధిలో 30 బస్సులను అద్దెకు తీసుకునేందుకు ప్రకటన జారీ చేశారు. ఈనెల 8 నుంచి 21వ తేదీ వరకు టెండర్ దాఖలు చేయవచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు. 21వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు టెండర్ దాఖలు చేసేందుకు చివరి తేదీగా సంస్థ వెల్లడించింది.
TSRTC: అద్దెబస్సులు కావలెను… ఈనెల 21 వరకు టెండర్ వేయొచ్చు - తెలంగాణ ఆర్టీసీ
TSRTC: అద్దెబస్సుల కోసం టీఎస్ఆర్టీసీ 8వ తేదీన టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. జిల్లాల కోసం 70 అద్దె బ్ససుల కోసం నోటిఫికేషన్ ఇచ్చినట్లు వెల్లడించింది. ఈ నెల 21వ తేదీన మధ్యాహ్నం 2 గంటల వరకు టెండర్ దాఖలు చేసేందుకు చివరి తేదీగా పేర్కొన్నారు.
టీఎస్ఆర్టీసీ అద్దెబస్సులు
21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టెండర్ ఓపెన్ చేస్తారు. ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో అద్దె బస్సుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఆర్టీసీ తెలిపింది. ఆర్టీసీలో ఒక పక్క డిపోలను తగ్గిస్తూ, మరోపక్క అద్దె బస్సులను పెంచడం వెనక ఆంతర్యం ఏంటని ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.బాబు, కె. రాజిరెడ్డిలు అభ్యంతరం తెలిపారు.
ఇదీ చూడండి:Sajjanar: కుటుంబసమేతంగా సజ్జనార్ సందడే సందడి.. వీడియో వైరల్!
Last Updated : Dec 9, 2021, 10:53 AM IST