తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యార్థినులకు టీఎస్​ఆర్టీసీ గుడ్​న్యూస్.. జూన్​ నుంచి ప్రత్యేక బస్సులు

Special RTC buses for girls in Telangana : ప్రయాణికుల కోసం టీఎస్​ఆర్టీసీ.. ఎప్పుడూ నూతనంగా ఆలోచిస్తూ ఉంటుంది. వారికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు కొత్త సౌకర్యాలు కల్పిస్తుంది. అందులో భాగంగానే వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థినులకు ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది.

Special RTC buses for girls in Telangana
Special RTC buses for girls in Telangana

By

Published : Mar 16, 2023, 9:18 AM IST

Special RTC buses for girls in Telangana : విద్యార్థినులకు పూర్తి రక్షణ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచన మేరకు.. ఉన్నత విద్యామండలి ప్రత్యేక చర్యలు చేపడుతోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థినులకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు నడపాలని టీఎస్‌ఆర్టీసీ సంస్థ నిర్ణయించింది. ఉదయం గమ్యస్థానానికి తీసుకెళ్లడం.. సాయంత్రం తిరిగి వారి ప్రదేశాలకు తీసుకొచ్చేందుకు ప్రత్యేక ట్రిప్పులు నడపడానికి సన్నాహాలు చేస్తోంది.

TSRTC Special buses for Girls : మహిళా కళాశాలలు సొంతంగా ఏర్పాటు చేస్తున్న బస్సుల్లో అధిక ఫీజులు ఉన్నందున కొంత మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. ఇలా ప్రతి కళాశాల నుంచి వంద నుంచి రండు వందల విద్యార్థులు సొంతంగా వస్తున్నారని సంస్థ గుర్తించింది. సొంతంగా రవాణా వ్యవస్థ ఉన్న కళాశాలలు ఒక్కో విద్యార్థి నుంచి ఏడాదికి రూ.40 వేల నుంచి రూ.50 వేలు వసూలు చేస్తున్నారు. అంత మొత్తం నగదును చెల్లించడం సామాన్యులకు భారంగా పరిణమిస్తోంది. షేర్‌ ఆటోల్లో, ఆర్టీసీ సిటీ బస్సుల్లో ప్రయాణించి కళాశాలలకు వెళ్తున్నారు.

ప్రత్యేక పాస్..అలాంటి వారి కోసం 50 మందికో బస్సు ఉండేలా సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. దీంతో టీఎస్​ఆర్టీసీకి స్థిరమైన ఆదాయం సమకూరడంతో పాటు సురక్షితమైన ప్రయాణం అందించడానికి వీలవుతుందని ఆర్టీసీ భావిస్తోంది. అందుకు కళాశాల దూరాన్ని బట్టి బస్సు టిక్కెట్‌ ధర ఆధారంగా నెలవారీ విద్యార్థులకు ప్రత్యేక పాస్‌ను సమకూర్చాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఇస్తోన్న విద్యార్థుల బస్సు పాస్‌తో సంబంధం లేకుండా.. ప్రత్యేకంగా ఆ బస్సులో విద్యార్థినులే ప్రయాణించేలా ఏర్పాట్లు చేయనున్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం ప్రతి విద్యార్థి ఏడాదికి సుమారు రూ.20 వేలకు చెల్లించాల్సి ఉంటుందని భావిస్తోంది.

డివిజన్ల వారీ నిర్ణయాలు: వచ్చే విద్యా సంవత్సరం 2023-24కి 500 బస్సులను టీఎస్‌ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ సిద్ధం చేస్తోంది. కళాశాలల యాజమాన్యాలతో సంప్రదించి.. ప్రత్యేక బస్సులు నగరంలో అన్ని ప్రదేశాల నుంచి ఉండేలా చర్యలు తీసుకుంటోంది. విద్యార్థినులను వారి ప్రదేశాల్లో వదిలేసిన తర్వాత అదే మార్గంలో ఇతర ప్రయాణికులను ఎక్కించుకోవడం ద్వారా ఎక్కువ నష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ ప్రత్యేక బస్సులను నడిపే బాధ్యత అంతా డివిజనల్‌ మేనేజర్లకే అప్పగించనున్నారు. ఇది విజయవంతమై ఆ తర్వాత దశలో విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాలు ముందుకొస్తే అందరికీ ప్రత్యేక బస్సులు సమకూర్చేట్లు సంస్థ భావిస్తోంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details