మహాశివరాత్రి నేపథ్యంలో శ్రీశైలానికి వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టామని రంగారెడ్డి ఆర్ఎం వరప్రసాద్ పేర్కొన్నారు. ఈ సంవత్సరం హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి 315 ప్రత్యేక బస్సులు సిద్ధం చేసినట్లు తెలిపారు. 18వ తేదీ నుంచి 23 వరకు బస్సులను నడపనున్నట్లు వెల్లడించారు.
శివరాత్రి స్పెషల్: శ్రీశైలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు - Telangana RTC Provides for special bus for Srisailam because of Mahashivaratri festival
ఈ నెల 21న మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని తెలంగాణ ఆర్టీసీ సమాయత్తం అవుతోంది. హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి 315 ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించుకున్నట్లు రంగారెడ్డి ఆర్ఎం వరప్రసాద్ తెలిపారు. ఈ నెల 18 నుంచి 23వరకు బస్సులు నడపనున్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని సూచించారు.

శ్రీశైలానికి ఆర్టీసీ 315 ప్రత్యేక బస్సులు
మహత్మగాంధీ బస్టాండ్ నుంచి సూపర్ లగ్జరీలో శ్రీశైలానికి 510, డీలక్స్ 450, ఎక్స్ప్రెస్ 400 రూపాయలు ఛార్జీలు నిర్ణయించినట్లు పేర్కొన్నారు. నగరంలోని ఇతర ప్రదేశాల నుంచి సూపర్ లగ్జరీ రూ. 550, డీలక్స్ రూ. 480 , ఎక్స్ప్రెస్ రూ. 430 రూపాయలు ఛార్జీలుగా నిర్ణయించామన్నారు. రద్దీకి అనుగుణంగా మరిన్ని ప్రత్యేక బస్సులను పెంచనున్నట్లు వివరించారు.
ఇదీ చదవండి:ఆ రైల్లోని 64వ సీటు శివుడికే శాశ్వతంగా కేటాయింపు!
Last Updated : Feb 17, 2020, 8:35 PM IST