తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫోన్​ కొట్టు బస్​పాస్​ పట్టు.. ఆర్టీసీ వినూత్న విధానం

ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఫోను కొడితే మీ చెంతకే బస్సు పాస్‌ను చేరవేస్తోంది. ఐదుగురికి తగ్గకుండా ఉండాలనే నిబంధన పెట్టింది.

ఫోన్​ కొట్టు బస్​పాస్​ పట్టు.. ఆర్టీసీ వినూత్న విధానం
ఫోన్​ కొట్టు బస్​పాస్​ పట్టు.. ఆర్టీసీ వినూత్న విధానం

By

Published : Jan 8, 2021, 10:52 AM IST

బస్‌పాస్‌ కోసం కౌంటర్‌ వద్దకు వెళ్లకుండా ఇంటివద్దకే అందించే వినూత్న కార్యక్రమానికి గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ శ్రీకారం చుట్టింది. 80082 04216 నంబరుకు ఫోను చేస్తే అపార్టుమెంట్‌, కాలనీ, మాల్‌, కార్యాలయం, కంపెనీ, పారిశ్రామిక వాడ ఇలా ఎక్కడున్నా.. మీకు అందించే బాధ్యత తమదని ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. అయితే ఐదుగురికి తగ్గకుండా ఉండాలనే నిబంధనను పెట్టారు.

ఇందుకు మీరు అదనంగా ఒక్క రూపాయి ఇవ్వాల్సిన పని లేదని చెప్పారు. అలాగే నగరంలో 31 బస్సు పాస్‌ కేంద్రాలను కూడా ప్రయాణికులకు అందుబాటులో ఉంచింది. ఇవి ఉదయం 7.30 గంటల నుంచి రాత్రి 8.15 గంటల వరకూ పని చేస్తాయి.

ఇదీ చూడండి:గ్రేటర్​​ హైదరాబాద్​లో నేటి నుంచి సీరో సర్వే

ABOUT THE AUTHOR

...view details