తెలంగాణ

telangana

ETV Bharat / state

రోడ్డు ప్రమాదాల నివారణకు.. ఆర్టీసీ చర్యలు! - ఆర్టీసీ

నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై ఆర్టీసీ అప్రమత్తమైంది. గతేడాది జరిగిన 730 ఆర్టీసీ బస్సుల ప్రమాదాల వల్ల దాదాపు రూ.40 కోట్ల రూపాయలు ఆర్టీసీ నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సుల ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్ణయం తీసుకుంది.

Telangana rtc planing for no more rtc accidents in telangana
రోడ్డు ప్రమాదాల నివారణకు.. ఆర్టీసీ చర్యలు!

By

Published : Jul 30, 2020, 10:33 AM IST

రోడ్డు ప్రమాదలపై ఆర్టీసీ అప్రమత్తమైంది. గత ఏడాది 730 ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి కారణమయ్యాయి. ఈ ప్రమాదాల్లో 342 మంది ప్రయాణికులు క్షతగాత్రులు అయ్యారు. ప్రమాద బాధితులకు ఆర్టీసీ సంస్థ రూ.40 కోట్లు నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది. నష్ట నివారణకు, ప్రమాదాల నియంత్రణకు ఆర్టీసీ పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ప్రమాదాలు జరగకుండా విడతల వారీగా ప్రణాళికలు అమలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ వర్షాకాలంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను సంస్థ విడుదల చేసింది. కల్వర్టులు, వంతెనలు దాటే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రతి డిపో పరిధిలో వంతెనలు, కల్వర్టులు ఎక్కడెక్కడా ఉన్నాయో తెలిపే మ్యాపులను అందుబాటులో ఉంచాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details