కరోనా వ్యాప్తి వల్ల ప్రయాణికులు ఆర్టీసీకి దూరమవుతున్న నేపథ్యంలో.. వారికి భరోసా కల్పించి, ఆర్టీసీని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్క కార్మికునిపై ఉందని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు అన్నారు. 2007 వేతన ఒప్పందాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ నిర్వీర్యం కోసమే కేంద్రం కొత్త విధానాలను తీసుకొస్తోందని, వాటిని రాష్ట్ర సర్కార్ అడ్డుకోవడం లేదని ఆరోపించారు.
ఆర్టీసీ సమ్మెలో అమరులైన కార్మికులకు నివాళి - telangana rtc preservation day is on October 5th
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన 55 రోజుల సమ్మెలో అసువులుభాసిన కార్మికులకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోలు, కార్యాలయాల వద్ద కార్మిక సంఘాలు నివాళులర్పించాయి. అక్టోబర్ 5ను ఆర్టీసీ పరిరక్షణ, కార్మికుల త్యాగదినంగా జరుపుకోవాలన్న యూనియన్ పిలుపు మేరకు హైదరాబాద్ బస్‌భవన్ వద్ద అమరులైన ఆర్టీసీ కార్మికులకు శ్రద్ధాంజలి ఘటించారు.
ఆర్టీసీ సమ్మెలో అసువులుభాసిన కార్మికులకు నివాళి
ఆర్టీసీ కార్మికులు చేపట్టిన 55 రోజుల సమ్మెలో ప్రాణాలు కోల్పోయిన కార్మికులకు హైదరాబాద్ బస్‌భవన్‌లో యూనియన్ ప్రతినిధులు శ్రద్ధాంజలి ఘటించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోలు, కార్యాలయాల్లో కార్మిక సంఘాలు అమరులైన కార్మికులకు నివాళులర్పించాయి.