ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ముందస్తు అరెస్ట్ - Telangana RTC JAC Convener ashwathama reddy arrest at Hyderabad
10:53 October 18
ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ముందస్తు అరెస్ట్
రేపటి బంద్‌ను విజయవంతం చేయాలని ఆర్టీసీ ఐకాస ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు, బైక్ ర్యాలీలను నిర్వహించారు. హైదరాబాద్‌లోని సుందరయ్య పార్కు వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో చేపట్టిన బైక్ ర్యాలీని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం ప్రారంభించారు. అక్కడి నుంచి ద్విచక్ర వాహనాలు ముందుకు వెళ్లే తరుణంలో పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీలో పాల్గొన్నఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డిని అరెస్ట్ చేశారు. ప్రభుత్వం మొండి వైఖరి వీడి, చర్చలకు ఆహ్వానించాలని అశ్వత్థామ రెడ్డి డిమాండ్ చేశారు. రేపటి బంద్‌ను విజయ వంతం చేయాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఎక్కడికక్కడ ఆర్టీసీ కార్మికులు, వామపక్షనేతలు, మహిళలను పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.
ఇవీ చూడండి : చరిత్రే చిన్నబోతోంది... ఆ రణభూమికి ఇప్పుడేమైంది!?