తెలంగాణ

telangana

ETV Bharat / state

నిలబడి ప్రయాణం కుదరదు! - telangana rtc is running during lock down

సామర్థ్యానికి మించి ప్రయాణికులను బస్సుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని ఆర్టీసీ నిర్ణయించింది. ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించింది. ఆ మేరకు క్షేత్రస్థాయి అధికారులను అప్రమత్తం చేసింది.

telangana RTC has decided not to allow passengers on buses Beyond capacity
నిలబడి ప్రయాణం కుదరదు

By

Published : May 26, 2020, 5:37 AM IST

లాక్​డౌన్ నిబంధనల సడలింపుతో ఆర్టీసీ బస్సుల రవాణా ప్రారంభమైంది. ఇన్ని రోజులు ఇంటి పట్టునే ఉన్న ప్రజలు వివిధ పనుల నిమిత్తం ఇప్పుడు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. కరోనా వైరస్​ ఇంకా అంతమొందనందున ఇంతకుముందులా బస్సు సామర్థ్యం కంటే ఎక్కువ ప్రయాణికులను ఎక్కించుకునే వీలు లేదు.

పల్లెవెలుగు బస్సుల్లో కొన్ని మార్గాల్లో సీటింగ్‌ సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కిస్తున్నట్లు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ దృష్టికి వచ్చింది. సామర్థ్యానికి మించి ప్రయాణికులను బస్సుల్లో ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకూడదని నిర్ణయిస్తూ ఆర్టీసీ.. ఆదేశాలు జారీచేసింది. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను విధిగా అమలు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

మార్గదర్శకాల అమలు విషయంలో రాజీ పడితే ఉపేక్షించేది లేదన్నారు. గత మంగళవారం నుంచి హైదరాబాద్‌ మినహా రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు నడుపుతున్న విషయం తెలిసిందే. రోజు వారీగా మూడు వేల వరకు బస్సులను నడుపుతోంది. అధికశాతం బస్సుల్లో సగం కూడా ఆక్యుపెన్సీ ఉండటం లేదు.

మాస్క్‌ లేకుండా ప్రయాణికులను ఎక్కించుకోకూడదని సిబ్బందిని ఆర్టీసీ ఆదేశించింది. ఆకస్మిక తనిఖీల్లో మాస్క్‌ లేకుండా ప్రయాణికులు బస్సులో కనిపిస్తే సంబంధిత సిబ్బంది బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. మాస్క్‌ లేకుండా బస్సు ఎక్కకూడదంటూ, బస్సులు ఎక్కేముందు శానిటైజర్‌తో కానీ సబ్బు నీళ్లతో కానీ చేతులు శుభ్రం చేసుకోవాలంటూ బస్‌ పాయింట్లలో మైకుల ద్వారా ప్రయాణికులను చైతన్యం చేయాలని ఆర్టీసీ ఇన్‌ఛార్జి మేనేజింగ్‌ డైరెక్టర్‌ సునీల్‌ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.

అటెండర్లుగా అదనపు డ్రైవర్లు, కండక్టర్లు

సమ్మె తరవాత హైదరాబాద్‌ ఆర్టీసీ జోన్‌ పరిధిలో సుమారు ఎనిమిది వందల బస్సులను నిలిపివేయడంతో పాటు అద్దె ప్రాతిపదికన కొన్ని ప్రైవేట్‌ బస్సులను తీసుకుంది. ఫలితంగా డ్రైవర్లు, కండక్టర్లు అవసరానికి మించి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే వారిని వివిధ విభాగాలు, కార్యాలయాల్లో అటెండర్లుగా వినియోగించుకునేందుకు నిర్ణయించారు. ఆసక్తి చూపే సిబ్బంది నుంచి దరఖాస్తులు తీసుకోవాలని, జూన్‌ ఆరో తేదీలోగా ఆ జాబితాను సిద్ధం చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details