TSRTC New Website: గణతంత్ర దినోత్సవం సందర్భంగా టీఎస్ఆర్టీసీ సంస్థ కొత్త వెబ్‌సైట్ tsrtc.telangana.gov.inను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి, ఎండీ సజ్జనార్‌లు వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. అంతకుముందు బస్‌భవన్‌లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఛైర్మన్ గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్‌లు జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం అధికారులు, సిబ్బందికి శుభాకాంక్షలు చెప్పారు.
TSRTC New Website: టీఎస్ఆర్టీసీ నూతన వెబ్‌సైట్ ప్రారంభం - టీఎస్ఆర్టీసీ నూతన వెబ్‌సైట్
TSRTC New Website: టీఎస్ఆర్టీసీ నూతన వెబ్‌సైట్‌ను సంస్థ యాజమాన్యం అందుబాటులోకి తీసుకొచ్చింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి, ఎండీ సజ్జనార్.. కొత్త పోర్టల్ tsrtc.telangana.gov.in ను ఆవిష్కరించారు.
టీఎస్ఆర్టీసీ నూతన వెబ్‌సైట్ ప్రారంభం
ఆర్టీసీ నూతన వెబ్‌సైట్ చాలా బాగుందని.. సామాన్యులు సైతం సులభంగా వినియోగించుకొనేలా ఉందని ఆర్టీసీ ఛైర్మన్, ఎండీ అన్నారు. పాత పోర్టల్‌లో మార్పులు చేసి.. నూతన వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. కొత్త వెబ్‌సైట్‌ను సందర్శించి, ఆర్టీసీ అభివృద్ధికి సంబంధించి విలువైన అభిప్రాయాలు, సూచనలను పంపాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
ఇదీచూడండి:చర్మంపై 21 గంటలు సజీవంగా 'ఒమిక్రాన్'.. ప్లాస్టిక్‌పై 8 రోజులకుపైనే!