ఆర్టీసీ యాజమాన్య వైఖరికి నిరసనగా... ఆర్టీసీ సీసీఎస్ పాలకవర్గం సభ్యులు విద్యానగర్‌లోని సీసీఎస్ కార్యాలయంలో మౌనదీక్ష చేపట్టారు. ఆర్టీసీ నుంచి సీసీఎస్‌కు రావాల్సిన రూ. 635 కోట్లను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సీసీఎస్ రికవరీ మొత్తం... ప్రతినెలా 10వ తేదీలోపు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.
'ఆర్టీసీ నుంచి సీసీఎస్‌కు రూ. 635 కోట్లు చెల్లించాలి' - సీసీఎస్ పాలకవర్గం తాజా వార్తలు
ఆర్టీసీ నుంచి సీసీఎస్‌కు రావాల్సిన రూ. 635 కోట్లను వెంటనే చెల్లించాలని సీసీఎస్ పాలకవర్గం సభ్యులు డిమాండ్ చేశారు. ఆర్టీసీ యాజమాన్య వైఖరికి నిరసనగా... విద్యానగర్‌లోని సీసీఎస్ కార్యాలయంలో మౌనదీక్ష చేపట్టారు.
వెంటనే రూ. 635 కోట్లు చెల్లించాలి: ఆర్టీసీ సీసీఎస్ పాలకవర్గం
ఒప్పందం ప్రకారం రావాల్సిన వడ్డీ 96 కోట్ల రూపాయలు తక్షణమే చెల్లించాలన్నారు. ఇప్పటికే కార్మికులకు రుణాలు ఇవ్వలేని స్థితికి సీసీఎస్ చేరుకుందని.... త్వరగా నిధులు విడుదల చేయాలని పాలకవర్గం కోరింది.
ఇదీ చూడండి:పింఛన్ల కోతపై వివరణివ్వండి.. సర్కార్కు హైకోర్టు నోటీసులు