Student Crushed by School Bus in Hyderabad Today :బుడిబుడి అడుగులేసే నాన్నతో కలిసి బడికి బయలుదేరిన ఆ చిన్నారిని రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది. హైదరాబాద్ బాచుపల్లిలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను కలిచివేసింది. బాచుపల్లిలోని ఇంద్రప్రస్థ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉండే కిశోర్ ఇవాళ ఉదయం ద్విచక్రవాహనంపై కుమార్తెను తీసుకుని పాఠశాలకు బయలుదేరాడు. బాచుపల్లి రెడ్డీస్ లేబొరేటరీ వద్దకు రాగానే బైక్ అదుపుతప్పి, తండ్రీకూతురు కిందపడిపోయారు. ఇదే సమయంలో వెనక నుంచి వచ్చిన ఓ స్కూల్ బస్సు రోడ్డుపై పడిపోయిన పాప తలపై నుంచి వెళ్లగా చిన్నారి దీక్షిత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
Hyderabad School Bus Accident Today :బైక్‌పై నుంచి కిందపడి గాయపడిన తండ్రిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కళ్ల ముందే పాప కిందపడిపోవటం.. అదే సమయంలో వచ్చిన బస్సు చిదిమేయటంతో స్థానికంగా విషాదం నెలకొంది. పాప మృతదేహాన్ని చూసి కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. చిన్నారి దిల్లీ పబ్లిక్ స్కూల్లో మూడో తరగతి చదువుతోందని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలిలో సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా విచారణ చేపట్టి.. స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణంగా తేల్చారు. అతివేగంగా వెనుక నుంచిబైక్‌ను ఢీకొట్టినట్లు గుర్తించారు. స్కూల్ బస్ డ్రైవర్ రహీంను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
- స్కూల్ బస్సు- కారు ఢీ.. ఆరుగురు మృతి.. రాంగ్ రూట్లో రావడం వల్లే..
- Bandlaguda car accident : బర్త్‌డే మూడ్.. లైసెన్స్ లేకున్నా డ్రైవింగ్.. చివరకు ఆ కుటుంబంలో విషాదం
Jangaon Road Accident Today : జనగామ జిల్లా లింగాలగణపురం మండలం కుందారం కెనాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడగా.. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన శ్రీనివాస్-నాగమణి దంపతులు కొడుకు, కోడలు ప్రశాంత్-సింధుజతో కలిసి కారులో వెళ్తున్నారు. కుందారం కెనాల్ వద్దకు రాగానే కారు అదుపుతప్పి, చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో సింధుజ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆమె భర్త ప్రశాంత్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. శ్రీనివాస్-నాగమణి దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. వీరికి జనగామ జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా.. పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రశాంత్‌ను హైదరాబాద్‌కు తరలించారు.