Telangana Revenue Till August 2023 :2023 - 24 ఆర్థిక సంవత్సరం(Financial Year)లో ఆగస్టు నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వానికి రూ.72,933 కోట్ల రెవెన్యూ రాబడి వచ్చింది. బడ్జెట్(Budget 2023-2024) అంచనాలో దాదాపు 34 శాతం వరకు ఉంది. పన్నుల రూపంలో మొదటి ఐదు నెలల్లో రూ.55,441 కోట్లు సమకూరాయి. బడ్జెట్ అంచనాలో ఇది 36 శాతానికి పైగా ఉంది.
జీఎస్టీ(GST) ద్వారా రూ.18,754 కోట్లు, స్టాంపులు - రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.5,852 కోట్లు, అమ్మకం పన్నుద్వారా రూ.12,386 కోట్లు ఖజానాకు వచ్చాయి. ఎక్సైజ్ పన్నుల రూపంలో రూ.10,149 కోట్లు రాగా.. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా రూ.5,064 కోట్లు సమకూరాయి. ఇతర పన్నుల రూపంలో మరో రూ.3,234 కోట్లు వచ్చాయి. 2023-24లో ఆగస్టు నెలలో అత్యధికంగా రూ.12,729 కోట్లు పన్నుల ద్వారా సమకూరాయి.
Telangana Financial Statistics 2023 : పన్నేతర ఆదాయం ఆగస్టు నెలలో భారీగా వచ్చింది. జులై వరకు రూ.1,815 కోట్లు పన్నేతర ఆదాయం ద్వారా రాగా.. ఒక్క ఆగస్టులోనే రూ.12,666 కోట్లు సమకూరాయి. హైదరాబాద్ ఓఆర్ఆర్(ORR) లీజు, మద్యం దరఖాస్తులు, భూముల అమ్మకానికి సంబంధించిన నిధులు రావడంతో ఆ మొత్తం భారీగా పెరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ల రూపంలో ఆగస్టు నెలాఖరు వరకు కేవలం 3 వేల 9 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి. బడ్జెట్ లో రూ.41,259 కోట్లు గ్రాంట్ అంచనా వేయగా.. అందులో కేవలం 7 శాతం మాత్రమే వచ్చింది.
Telangana Tax Revenue Increased : 4 నెలల్లో.. రాష్ట్ర ఖజానాకు పన్నుల రూపంలో రూ. 42,712 కోట్లు