తెలంగాణ

telangana

ETV Bharat / state

ధరణి సమస్యల పరిష్కారంపై సర్కార్ కసరత్తు.. మాడ్యూళ్లపైనే ప్రత్యేక దృష్టి - New modules in Dharani

Problems in Dharani Portal: ధరణిలో సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కొత్త మాడ్యూళ్లు ఏర్పాటు చేయడమా.. ఉన్న వాటినే మార్పులు చేర్పులు చేయడమా అనే దానిపై సమాలోచనలు జరుపుతోంది. ఇక దీనికి సంబంధించి ఐఏఎస్​ కమిటీ ప్రత్యేకంగా దృష్టి సారించి సమస్యల పరిష్కారాలను అన్వేషిస్తోంది.

DHARANI
DHARANI

By

Published : Mar 19, 2023, 8:21 AM IST

Problems in Dharani Portal: రాష్ట్రంలో వివిధ రకాల భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్​ పూర్తి స్థాయిలో రైతులకు ఉపయోగపడటం లేదు. దీంతో రైతులు అనేక అవస్థలు పడుతున్నారు. తాజాగా ధరణి పోర్టల్‌లోని మాడ్యూళ్లకు సంబంధించి మార్పులు, చేర్పులపై రెవెన్యూ శాఖ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పోర్టల్‌లో నమోదైన సమాచారంలో తప్పులు, నమోదు కాని భూములను పొందుపరచడం వంటి సాంకేతికపరమైన సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ధరణి పోర్టల్‌లో ఇప్పటికే 33 మాడ్యూళ్లు ఉండగా.. అదనంగా మరో 10 మాడ్యూళ్లు సమాచారం తెలియజేసేవి ఉన్నాయి.

ఈ 33 మాడ్యూళ్ల ద్వారా అనేక సమస్యలు, సేవలకు సంబంధించి రైతులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. ‘గ్రీవెన్స్‌ ల్యాండ్‌ మ్యాటర్స్‌’, టీఎమ్​-33 మాడ్యూళ్లతో ఏ సమస్య ఉన్నా దరఖాస్తు చేసుకునే వీలుంది. అయితే అన్ని రకాల సమస్యలకు పరిష్కారాలు చూపే మార్గదర్శకాలు పోర్టల్​లో అందుబాటులో లేవు. దీనికితోడు దరఖాస్తు చేసిన ప్రతిసారీ రూ.1000కిపైగా రుసుం చెల్లించాల్సి రావడంతో రైతులపై అదనపు భారం పడుతోంది. వివిధ సమస్యలతో ఇప్పటికే 5 లక్షలకు పైగా దరఖాస్తులు ధరణి పోర్టల్‌లో నమోదయ్యాయి. వీటిలో వీలైనన్నింటికి అధికారులు పరిష్కారాలు చూపారు.

Changes in Dharani Portal: సర్వే నంబరులో పేర్కొన్న విస్తీర్ణం కంటే దస్త్రాల్లో ఎక్కువగా నమోదు కావడం, సర్వే నంబరు కనిపించకపోవడం, భూమి విస్తీర్ణంలో హెచ్చుతగ్గులను సవరించడం, కొత్తగా పోర్టల్‌లో ఖాతాను ఏర్పాటు చేయడం లాంటి సమస్యలకు పోర్టల్​లో మాడ్యూళ్లు లేవు. దాదాపు 40 రకాల సమస్యలు పోర్టల్​లో ఉన్నట్లు ఇప్పటికే గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇలాంటి సమస్యలకు సంబంధించి పరిష్కారాలు చూపేందుకు.. కొత్తగా మాడ్యూళ్లు ఏర్పాటు చేయాలా? లేదా ఉన్నవాటినే సవరిస్తే సరిపోతుందా? అనే దానిపై రెవెన్యూ అధికారులు కసరత్తు చేస్తున్నారు. సాంకేతిక అంశాలపై ప్రత్యేకంగా అధ్యయనం చేస్తున్నారు.

Modifications of modules in Dharani: భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ కార్యాలయంలో.. పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి ముగ్గురు ఐఏఎస్​ అధికారులతో కూడిన ప్రత్యేక కమిటీ పని చేస్తోంది. హైమావతి, రామయ్య, సత్యశారద పెండింగ్‌ దస్త్రాలను పరిశీలించిన తర్వాత భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ ఆ దస్త్రాలపై తుది నిర్ణయం తీసుకుంటున్నారు. త్వరలోనే పెండింగ్‌ దస్త్రాలపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని రెవెన్యూ వర్గాల నుంచి సమాచారం వస్తోంది.

ABOUT THE AUTHOR

...view details