సౌదీ అరేబియాలో తాజాగా కరోనా వైరస్‌తో 19 మంది మరణించగా.. అందులో ఐదుగురు భారతీయులున్నట్లు రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ఈ ఐదుగురిలో తెలంగాణకు చెందిన అజ్మతుల్లాఖాన్ కూడా మృతి చెందారు.
సౌదీలో కరోనాతో ఐదుగురు భారతీయులు మృతి - telangana resident died in saudi due to cororna
సౌదీ అరేబియాలో తాజాగా కరోనా వైరస్‌తో ఐదుగురు భారతీయులున్నట్లు రాయబార కార్యాలయం వెల్లడించింది. ఈ ఐదుగురిలో తెలంగాణకు చెందిన అజ్మతుల్లాఖాన్ కూడా మృతి చెందారు.
![సౌదీలో కరోనాతో ఐదుగురు భారతీయులు మృతి telangana-resident-died-in-saudi-due-to-cororna](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6862931-thumbnail-3x2-corona.jpg)
సౌదీలో కరోనాతో ఐదుగురు భారతీయులు మృతి
సౌదీలో కొవిడ్-19 వ్యాప్తిపై భారత రాయబార కార్యాలయం నిశితంగా పరిశీలిస్తోందని... దేశ పౌరుల సంక్షేమం కోసం అవసరమైన చర్యలన్నీ తీసుకుంటోందని భారత ఎంబసీ తెలిపింది. స్థానిక అధికారులు, వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపింది. వైద్య సాయం, అత్యవసర సేవల కోసం భారతీయ ప్రవాసులు ca.abudhabi@mea.gov.in కు వ్రాయవచ్చని లేదా 0508995583 నెంబరును సంప్రదించాలని సూచించారు.
ఇవీచూడండి:పోలీసులను చూసి భయమేసింది... కొత్తిమీర రోడ్డు పాలైంది