Telangana Covid Cases: రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం.. వెయ్యిలోపే కేసులు - తెలంగాణ కరోనా కేసులు
20:33 February 09
Telangana Covid Cases: తెలంగాణలో వెయ్యిలోపే కరోనా కేసులు నమోదు
Telangana Covid Cases: రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 61,573 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 865 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 7,80,836కి చేరింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.
గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,103కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 2,484 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 19,850 యాక్టివ్ కేసులు ఉన్నాయి.