తెలంగాణ

telangana

ETV Bharat / state

Corona: రాష్ట్రంలో కరోనా విజృంభణ.. ఒక్కరోజే 2,295 కేసులు - కరోనా వైరస్​ వార్తలు

రాష్ట్రంలో భారీగా పెరిగిన కరోనా కేసులు
రాష్ట్రంలో భారీగా పెరిగిన కరోనా కేసులు

By

Published : Jan 7, 2022, 7:44 PM IST

Updated : Jan 7, 2022, 10:29 PM IST

19:43 January 07

రాష్ట్రంలో కొత్తగా 2,295 కరోనా కేసులు

Covid Cases in Telangana: రాష్ట్రంలో కొవిడ్‌ ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. రోజువారీ కేసులు కొన్నినెలల తర్వాత 2వేల మార్కును దాటాయి. గడిచిన 24 గంటల్లో 64,744 పరీక్షలు నిర్వహించగా... 2,295 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,89,751కి చేరింది. వైరస్‌ బారిన పడి ముగ్గురు చనిపోగా.. మొత్తం మృతుల సంఖ్య 4,039కి చేరింది. కరోనా నుంచి 278 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9,861 యాక్టివ్‌ కేసులున్నాయి. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది.

జీహెచ్​ఎంసీ పరిధిలో అత్యధికంగా 1452, మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాలో 232 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. రంగారెడ్డిలో 218, హనుమకొండ 54, సంగారెడ్డి 50, నిజామాబాద్‌, ఖమ్మంలో 29 చొప్పున కొత్త కేసులు వచ్చినట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ నిన్నటితో పోల్చితే పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగింది.

క్రమంగా పెరుగుతున్న కేసులు

రాష్ట్రంలో క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నెల 2న 274 కరోనా కేసులు నమోదు కాగా... 3న 482, 4న 1052, 5వ తేదీన 1,520, 6న 1,913, ఇవాళ 2,295 కొవిడ్​ కేసులు నమోదయ్యాయి. కరోనా ఉద్ధృతి పెరుగుతుండటంతో ప్రతి ఒక్కరు భౌతికదూరం పాటిస్తూ మాస్క్​ ధరించాలని అధికారులు సూచించారు.

సునామిలా..

India covid cases: దేశంలో కరోనా.. సునామిలా దూసుకుపోతుంది. రోజు వ్యవధిలోనే రెట్టింపు వేగంతో కేసులు నమోదవుతున్నాయి. గురువారం ఒక్కరోజే.. 1,17,100 మందికి వైరస్​ సోకింది. గతేడాది జూన్​ 7 తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. వైరస్​ ధాటికి మరో 302 మంది చనిపోయారు. 30,836 మంది కొవిడ్​ను జయించారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం 7.74 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇదీ చదవండి:

Last Updated : Jan 7, 2022, 10:29 PM IST

ABOUT THE AUTHOR

...view details