కరోనా విజృంభణ: రాష్ట్రంలో మరో 1,321 కేసులు, 5 మరణాలు - covid 19 death stats telangana
09:15 April 04
కరోనా విజృంభణ: రాష్ట్రంలో మరో 1,321 కేసులు, 5 మరణాలు
తెలంగాణలో కరోనా రెండో దశ వ్యాప్తి మరింతగా పెరుగుతోంది. రాష్ట్రంలో క్రియాశీల కేసుల సంఖ్య 8,000కు చేరువైంది. గడిచిన 24 గంటల్లో 62,973 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1,321 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 3,12,140కి చేరింది. ప్రస్తుతం 7,923 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తాజాగా కరోనాతో ఐదుగురు మృతి చెందగా.. ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,717కు చేరింది. 293 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,886 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. మరోవైపు జీహెచ్‌ఎంసీ పరిధిలోనూ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా 320 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇదీ చూడండి:ప్రైవేటు వైద్య కళాశాలల్లోనూ ఉచిత ఆర్టీపీసీఆర్ పరీక్షలు