రాష్ట్రంలో విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(TPUS) డిమాండ్ చేసింది. ఈ మేరకు నాంపల్లిలోని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సంఘం సభ్యులు ధర్నా నిర్వహించారు.
ఉద్యోగులకు 63 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి: టీపీఎస్యూ - హైదరాబాద్లో టీపీయూఎస్ ధర్నా
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు 63 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం డిమాండ్ చేసింది. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించింది.

ఉద్యోగులకు 63 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి: టీపీఎస్యూ
రాష్ట్రంలో 1-7-2018 నుంచి పీఆర్సీ అమలు చేస్తూ.. 63 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని టీపీయూఎస్ కోరింది. 16 మే 2018న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సభ్యులు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ బదిలీ ప్రక్రియకు షెడ్యూల్డ్ ప్రకటించి వెంటనే పూర్తి చేయాలని విన్నవించారు. సీపీఎస్ విధానం రద్దు సహా పాఠశాలల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు.
ఇదీ చదవండి:రైతు బంధు సాయం కింద రూ.7351.74 కోట్లు పంపిణీ