తెలంగాణ

telangana

'కలిసి కొట్లాడుదాం.. కలలుగన్న తెలంగాణను సాధించుకుందాం'

తెలంగాణ రాష్ట్రీయ లోక్​దళ్​ పార్టీ కార్యాలయాన్ని హిమాయత్ నగర్​లో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్​కుమార్​ ప్రారంభించారు. కలిసి కొట్లాడుదాం.. కలలుగన్న తెలంగాణను సాధించుకుందాం.. అనే నినాదంతో ముందుకెళ్తామని పేర్కొన్నారు.

By

Published : Sep 18, 2020, 11:05 PM IST

Published : Sep 18, 2020, 11:05 PM IST

Telangana Rashtriya Lok Dal Party office started in himayath nagar hyderabad
'కలిసి కొట్లాడుదాం.. కలలుగన్న తెలంగాణను సాధించుకుందాం'

ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం... తెలంగాణ రాష్ట్రీయ లోక్​దళ్​ పార్టీ పని చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్​కుమార్​ అన్నారు. కలిసి కొట్లాడుదాం.. కలలుగన్న తెలంగాణను సాధించుకుందాం.. అనే నినాదంతో ముందుకెళ్తామని పేర్కొన్నారు.

హిమాయత్ నగర్​లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో టిఆర్ఎల్డీ పార్టీ మిలిటెంట్ తరహా ఉద్యమాలు చేసిందని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం అవిర్భవించాక అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోయామనే అసంతృప్తి ప్రతి ఒక్క ఉద్యకారుడిలో ఉందని ఆయన పేర్కొన్నారు.

ఆ లక్ష్యాల సాధన కోసం టిఆర్ఎల్డీ ప్రజా ఉద్యమాలతో ముందుకు వెళ్తుందన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానం, లాక్​డౌన్ కారణంగా ప్రైవేట్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై... ఈ నెల 20న కాచిగూడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు.

ABOUT THE AUTHOR

...view details