తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖరీఫ్‌ ధాన్యం లక్ష్యాల ప్రకారం మూడో స్థానంలో తెలంగాణ - kharif grains target news

దేశవ్యాప్తంగా ఖరీఫ్​ పంటల్లో వివిధ రాష్ట్రాలు పెట్టుకున్న లక్ష్యాల ప్రకారం తెలంగాణ మూడో స్థానంలో, ఏపీ ఐదో స్థానంలో ఉన్నాయి. గత ఏడాది ఏపీ... తెలంగాణ కంటే 75 వేల మెట్రిక్‌ టన్నులు ఎక్కువగా కొంది. ప్రస్తుత ఖరీఫ్‌(వానాకాలం) ధాన్యం సేకరణకు సంబంధించి ఏపీలో 59.70 లక్షల మెట్రిక్‌ టన్నులు లక్ష్యం కాగా, తెలంగాణలో 74.63 లక్షల మెట్రిక్‌ టన్నులు సిద్ధంగా ఉన్నాయి.

telangana ranks third in kharif  crops
ఖరీఫ్‌ ధాన్యం లక్ష్యాల ప్రకారం దేశంలో మూడో స్థానంలో తెలంగాణ

By

Published : Sep 30, 2020, 7:59 AM IST

ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలులో తెలంగాణ రాష్ట్రం భారీ లక్ష్యం నిర్దేశించుకుంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు పెట్టుకున్న లక్ష్యాల ప్రకారం తెలంగాణ మూడో స్థానంలో, ఏపీ ఐదో స్థానంలో ఉన్నాయి. గత ఏడాది ఏపీ... తెలంగాణ కంటే 75 వేల మెట్రిక్‌ టన్నులు ఎక్కువగా కొంది.

ప్రాజెక్టుల నిర్మాణంతో పెరిగిన సాగు విస్తీర్ణం

ప్రస్తుత ఖరీఫ్‌(వానాకాలం) ధాన్యం సేకరణకు సంబంధించి ఏపీలో 59.70 లక్షల మెట్రిక్‌ టన్నులు లక్ష్యం కాగా, తెలంగాణలో 74.63 లక్షల మెట్రిక్‌ టన్నులు. దేశంలో పంజాబ్‌లో అత్యధికంగా 168.66 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొననుండగా, 89.55 లక్షల మెట్రిక్‌ టన్నులతో ఛత్తీస్‌గఢ్‌ రెండో స్థానంలోనూ, తెలంగాణ మూడో స్థానంలోనూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ది ఐదో స్థానం. గత ఏడాది కంటే ఈ ఏడాది తెలంగాణలో 27.55 లక్షల మెట్రిక్‌ టన్నులు అదనంగా కొంటున్నారు. భారీ, మధ్యతరహా ప్రాజెక్టులు, చిన్ననీటి వనరుల కింద వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరగడంతో దేశంలో అత్యధికంగా ధాన్యం కొనుగోలు చేసే మొదటి మూడు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా నిలిచింది.

తెలంగాణలో ఖరీఫ్​, రబీ పంటల వివరాలు

అక్టోబర్ రెండోవారం నుంచి కొనుగోళ్లు

గత కొన్నేళ్లుగా తెలంగాణలో వరిసాగు విస్తీర్ణం పెరిగి అధిక ధాన్యం దిగుబడి రావడమే కాకుండా దేశంలో ధాన్యం సేకరణలో ముఖ్యమైన రాష్ట్రంగా మారింది. 2013-14 ఖరీఫ్‌లో 28.42 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తే, ఈ ఏడాది లక్ష్యం 74.63 లక్షల మెట్రిక్‌ టన్నులు. ఈ ఆరేళ్లలో ఏకంగా 46.21 లక్షల మెట్రిక్‌ టన్నులు అదనంగా సేకరిస్తుండటం విశేషం. ధాన్యం ముందుగానే వచ్చే అవకాశం ఉండటంతో పంజాబ్‌, హరియాణాలలో సెప్టెంబరు 26 నుంచే ప్రారంభించగా, తెలంగాణలో వచ్చే నెల రెండో వారంలో ప్రారంభించనున్నారు.

తెలంగాణలో 6,500 ధాన్యం కేంద్రాలను, ఏపీలో 1,734 కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందించారు. 2014-15 వరకు భారత ఆహార సంస్థే ధాన్యం కొనేది. తర్వాత నుంచి రాష్ట్రాలే కొంటున్నాయి. రైతుల నుంచి ఇలా సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసిన తర్వాత రాష్ట్రంలో ప్రజా పంపిణీకి అవసరమైన బియ్యాన్ని ఉంచుకొని మిగిలిన వాటిని భారత ఆహార సంస్థకు(ఎఫ్‌సీఐకి) ఇస్తారు. సేకరణకు అవసరమైన మొత్తాన్ని మొదట రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారానూ, ఇతరత్రా మార్గాల్లో సమకూర్చుతుండగా, తర్వాత కేంద్రం ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ప్రజా పంపిణీ వ్యవస్థకు బియ్యాన్ని ఎఫ్‌సీఐ మళ్లిస్తుంది.

ఇదీ చదవండిఃస్వచ్ఛ భారత్‌’లో మూడోసారి సత్తాచాటిన తెలంగాణ

ABOUT THE AUTHOR

...view details