దేశవ్యాప్తంగా సుమారు 759.60 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్‌ఎంటీ) ధాన్యాన్ని 2019-20 వార్షిక పంట కాలానికి సేకరించినట్లు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) తన అధికారిక ట్విటర్ ఖాతాలో వెల్లడించింది. ఇందులో 162.33 ఎల్‌ఎంటీ ధాన్యం సేకరణతో పంజాబ్ తొలి స్థానం దక్కించుకుంది. 111.26 ఎల్‌ఎంటీతో తెలంగాణ రెండో స్థానంలో, 79.46 ఎల్‌ఎంటీతో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచాయి.
ఎఫ్‌సీఐ ధాన్యం సేకరణలో.. తెలంగాణకు రెండో స్థానం - FCI news
ఎఫ్‌సీఐ ధాన్యం సేకరణలో తెలంగాణకు రెండో స్థానం దక్కింది. మొదటి స్థానంలో పంజాబ్ రాష్ట్రం ఉండగా.. ఏపీ మూడో స్థానంలో నిలిచింది.
![ఎఫ్‌సీఐ ధాన్యం సేకరణలో.. తెలంగాణకు రెండో స్థానం Telangana ranks second in FCI grain procurement](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8572082-890-8572082-1598492487679.jpg)
ఎఫ్‌సీఐ ధాన్యం సేకరణలో.. తెలంగాణకు రెండో స్థానం