తెలంగాణ

telangana

ETV Bharat / state

Agricultural Progress: మూడో స్థానంలో తెలంగాణ.. నాలుగో స్థానంలో ఆంధ్రప్రదేశ్​

వ్యవసాయరంగ పురోగతిలో దేశంలో తెలంగాణ మూడో స్థానంలో, ఏపీ నాలుగో స్థానంలో ఉన్నాయని నీతి ఆయోగ్ సభ్యుడు ప్రొఫెసర్ రమేష్ చంద్ వెల్లడించారు. రైతు ఆదాయంలో పంటల వాటా 2011-12లో 65.4% మేర ఉండగా... 2018-19 నాటికి అది 55.3%కి పడిపోయిందని వెల్లడించారు.

Agricultural Progress
వ్యవసాయరంగ పురోగతి

By

Published : Sep 28, 2021, 6:40 AM IST

దేశంలో గత పదేళ్లలో వ్యవసాయరంగ పురోగతి(Agricultural progress)ని విశ్లేషిస్తే కేవలం 11 రాష్ట్రాల్లోనే పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని నీతి ఆయోగ్‌ సభ్యుడు ప్రొఫెసర్‌ రమేష్‌చంద్‌ పేర్కొన్నారు. స్వాతంత్య్రానంతరం దేశ వ్యవసాయరంగ పురోగతి (The agricultural progress of the country)పై రూపొందించిన విశ్లేషణ పత్రాన్ని ఆయన విడుదల చేశారు. దీని ప్రకారం 2011-12 నుంచి 2019-20 మధ్యకాలంలో కేవలం 11 రాష్ట్రాల్లోనే 3%కి మించిన సగటు వృద్ధి రేటు నమోదైందని, ఇందులో మూడో స్థానంలో తెలంగాణ, నాలుగో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ ఉన్నాయని చెప్పారు.

‘10 రాష్ట్రాల్లో వ్యవసాయవృద్ధి -3.63% నుంచి 1%కి పరిమితమవగా... మరో 8 రాష్ట్రాల్లో అది 1.05% నుంచి 2.96% మధ్య నమోదైంది. మిగిలిన 11 రాష్ట్రాల్లో 3.38% నుంచి 6.87%మేర కనిపించింది. రైతు ఆదాయంలో పంటల వాటా 2011-12లో 65.4% మేర ఉండగా... 2018-19 నాటికి అది 55.3%కి పడిపోయింది. పంచవర్ష ప్రణాళికలు మొదలైన తొలి 15 ఏళ్లలో వరి, గోధుమ, మొక్కజొన్న పంటల వార్షిక వృద్ధి రేటు 4.28% మేర నమోదవగా... గత 15ఏళ్లలో ఆ మూడు పంటల సగటు వృద్ధి 2.37%కి పరిమితమైంది. చిరుధాన్యాల వృద్ధిరేటు 2.38% నుంచి -1.94%కి పడిపోయింది’ అనిఆయన వివరించారు.

ఇదీ చూడండి:Crop losses: వేల ఎకరాల్లో మునిగిన పైర్లు.. పెట్టుబడి రాయితీ కోల్పోతున్న రైతులు!

ABOUT THE AUTHOR

...view details