Heavy Rains in Telangana :రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. పలు చోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.హైదరాబాద్లో రాత్రంతా వర్షం కురిసింది. భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ చెప్పడంతో ఏం జరుగుతుంతోనని భయపడిన నగరవాసులు.. తేలికపాటి వర్షం పడడంతో ఊపిరి పీల్చుకున్నారు. భాగ్యనగరంలో వానలకు, చలికి నగరవాసులు గజగజలాడిపోతున్నారు. వర్షానికి తోడు ఉష్ట్రోగ్రతలు పడిపోవడంతో నగరంలో చలి వాతావరణం కనిపిస్తోంది. వర్షాలు కూడా ఎడతెరపి లేకుండా కురుస్తుండటంతో నగరవాసులు నానుతున్నారు.
Hyderabad Rains Today :హైదరాబాద్ వ్యాప్తంగా ముసురు కొనసాగుతోంది. లోతట్టు ప్రాంతాలతో పాటు పలుచోట్ల రహదారులపై నీళ్లు నిలిచాయి. తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసింది. రాత్రి ఒంటి గంట వరకు టోలిచౌకిలో అత్యధికంగా 10.1, బండ్లగూడ 2.6, కత్బుల్లాపూర్‌లో1.7, రాజేంద్రనగర్‌లో 1.9 సెంటిమీటర్ల వర్షం పడింది.
Telangana Rains :వాతావరణశాఖ ముందస్తు హెచ్చరికలతో ఆర్డీఎఫ్, బీహెచ్ఎంసీ బృందాలు.. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో అవసరమైన చర్యలు చేపట్టాయి. జంట జలాశయాల నుంచి మూసీకి వస్తున్న వరదనీటితో ఇబ్బందులు కలగకుండా పరివాహక ప్రాంతాల్లో స్థానిక పోలీసుల సాయంతో బల్దియా అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. లోతట్టు ప్రాంతాల్లో వరద నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. రెండు రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉండాలని డీజీపీ అంజనీకుమార్ పోలీసులను ఆదేశించారు. కమిషనర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్‌లో సూచనలు చేశారు.