Telangana Rains Toady : జిల్లాల్లో ఏకధాటి వర్షాలకు వాగులు పొంగిపొర్లుతుండగా చెరువులు జలకళ సంతరించుకుంటున్నాయి. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో జోరు వానలు కురిశాయి. భద్రాద్రి జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టుకు ఎగువన ఛత్తీస్‌గఢ్ నుంచి వరద భారీగా చేరుతోంది. ప్రాజెక్టు 24గేట్లు ఎత్తి లక్ష క్యూసెక్కులకుపైగా నీటిని దిగువన గోదావరిలోకి వదులుతున్నారు. గోదావరికి ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో భద్రాచలం వద్ద నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. 43అడుగులు దాటడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
ప్రస్తుతం 45 అడుగులు దాటి ప్రవహిస్తోంది. నది నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందన్న కలెక్టర్ ప్రియాంక అలా లోతట్టు ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొత్త కాలనీని పరిశీలించిన కలెక్టర్ బాధిత ప్రజలతో మాట్లాడారు. స్థానిక పాఠశాలలో పునరావాస కేంద్రానికి వెళ్లాలని అక్కడ అన్ని ఏర్పాట్లు చేశామని వివరించారు. వృద్ధులు, గర్భిణిలు, చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారనే అంశాలను ఆరా తీశారు. గోదావరి కరకట్ట, విస్తా కాంప్లెక్స్ ఏరియాలో వరద పరిస్థితిని పరిశీలించారు. రామాలయం వద్ద చేరిన నీటిని ఐదు మోటార్ల ద్వారా తొలగించి వెంటనే శుభ్రపరచినట్లు తెలిపారు.
- Huge Water Inflow to Projects : రాష్ట్రవ్యాప్తంగా జోరువానలు.. వరద ప్రవాహంతో గోదారమ్మ పరుగులు
- Musi River Purification : 'మూసీ నది ప్రక్షాళనకు ప్రతిపాదనలు.. కేంద్రం వద్ద పెండింగ్లో లేవు'
Rains in Telangana 2023 :ఎడతెరిపి లేని వాన వరంగల్ జిల్లా జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తోంది. రెండు రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హనుమకొండ, వరంగల్‌లో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్లు ప్రాంతాల కాలనీల్లోకి వరదచేరుతోంది. కాశీబుగ్గలోని సాయిగణేశ్నగర్తోపాటు డీకేనగర్ సమ్మయ్యనగర్ ప్రాంతాల్లోకి వర్షం నీరు చుట్టుముట్టింది. చిన్న వడ్డేపల్లి చెరువు వద్ద తాత్కాలికంగా వేసిన గుడిసెలను వీడి సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. మరో మూడు రోజులు భారీ వర్షసూచన ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు.