రాష్ట్ర సచివాలయ నూతన భవన నిర్మాణ పనులు చేపట్టేందుకు ముందుకొచ్చిన సంస్థల వివరాలతో రహదారులు, భవనాల శాఖ... కమిషనరేట్ ఆఫ్ టెండర్స్‌కు నివేదిక పంపింది. ఈ నెల 20వ తేదీన సాంకేతిక బిడ్లు తెరవగా... షాపుర్ జీ పల్లొంజీ, ఎల్ అండ్ టీ కంపెనీల బిడ్లు దాఖలయ్యాయి. శుక్రవారం ఆర్థిక బిడ్లను తెరిశారు. అయితే నిబంధనల ప్రకారం పది కోట్ల వ్యయం కన్నా ఎక్కువ ఉన్న టెండర్లను కమిషనరేట్ ఆఫ్ టెండర్స్‌కు నివేదించాల్సి ఉంటుంది.
సచివాలయ నిర్మాణంపై సీవోటీకి నివేదిక - సచివాలయం నిర్మాణం టెండర్లు
సచివాలయ భవన సముదాయ టెండర్ బిడ్లు కమిషనరేట్ ఆఫ్ టెండర్స్‌కు వెళ్లనున్నాయి. టెండర్ ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది.

సచివాలయ నిర్మాణంపై సీవోటీకి నివేదిక
సచివాలయ టెండర్ బిడ్లను కమిషనరేట్ ఆఫ్ టెండర్స్‌కు నివేదించి అక్కడ చర్చిస్తారు. సోమ, మంగళ వారాల్లో సీవోటీ సమావేశమై గుత్తేదారును ఖరారు చేయనుంది.
ఇదీ చూడండి:'రోడ్డు నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలి'