Telangana government: డాక్టర్లు, నర్సులకు సెలవులు రద్దు: ప్రభుత్వం - Telangana Public health staff leaves cancelled
![Telangana government: డాక్టర్లు, నర్సులకు సెలవులు రద్దు: ప్రభుత్వం DH Press Meet Today](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14111404-thumbnail-3x2-keer.jpg)
13:49 January 06
వచ్చే 4 వారాలు వాళ్లకు సెలవులు రద్దు
తెలంగాణలో కరోనాతో పాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజారోగ్య సిబ్బందికి నేటి నుంచి సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రజారోగ్య సంచాలకులు డీహెచ్ శ్రీనివాస్ తెలిపారు. వచ్చే 4 వారాలు ఎలాంటి సెలవులు ఇవ్వబోమని పేర్కొన్నారు. మూడో దశను ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధంగా ఉన్నామని వివరించారు. వచ్చే నాలుగు వారాలు కీలకమని చెప్పారు. వైరస్‌ను కట్టడి చేయడానికి రాష్ట్ర ప్రజలందరికీ వైద్యారోగ్యశాఖ పలు సూచనలు చేస్తోందని.. వాటిని పాటించాలని డీహెచ్ సూచించారు.
ప్రజారోగ్య సంచాలకులు డీహెచ్ సూచనలు
- తప్పనిసరిగా ఇంటా, బయటా మాస్కు ధరించాలి
- భౌతికదూరం పాటించాలని కోరుతున్నాం
- టీకా తీసుకోని వారు వెంటనే వ్యాక్సిన్ తీసుకోవాలి
- గాలి బాగా తగిలే ప్రదేశాల్లో ఉండాలి
- వ్యాధి లక్షణాలు ఉన్నవారు పరీక్షలు చేయించుకోవాలి
- లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలి
- తక్కువ లక్షణాలు ఉన్నవారు హోం ఐసోలేషన్‌లో ఉండాలి
TAGGED:
s